ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కెళ్లిన తర్వాత పద్దతి మార్చిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్..తాప్సీ తరహాలో ముక్కు సూటి వైఖరిని ప్రదర్శిస్తుంది. విషయం ఏదైనా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడేస్తోంది. ఎలాంటి అంశంపైనైనా తనదైన శైలిలో స్పందిస్తుంది. ఆ మధ్య తెలుగులో తనకూ లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో అవకాశాలు కల్పించాలని..పాన్ ఇండియా చిత్రాలకు ఏమాత్రం తక్కువ కాదని..అంతటి క్రేజ్ మాకు ఉందంటూ నర్మగర్భంగా స్పందించింది.
అప్పటివరకూ కామ్ గా ఉన్నా రకుల్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అని టాలీవుడ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి బాలీవుడ్ లో తన ప్రత్యేకతని చాటే ప్రయత్నం చేస్తుంది. బోల్డ్ అటెంప్ట్ లకు సైతం సిద్దం అనేసింది. ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి రెడీ అంటూ ముందుకు సాగిపోతుంది. ఈ రక మైన స్టేట్ మెంట్లు అమ్మడికి అవకాశాలు బాగానే తెచ్చిపెడుతున్నాయి.
ప్రస్తుతం ఈ భామ ప్రధాన పాత్రలో తేజస్ ప్రభా విజయ్ డియో స్కర్ దర్శకత్వం లో 'ఛత్రవాలి' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది ఓ కండోమ్ చుట్టు తిరిగే కథ. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా కమిట్ అయిన దగ్గర నుంచి రకుల్ పై విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పాత్రల ఎలా ఒప్పుకున్నారు? ఇలాంటి సినిమా చేస్తున్నారని అమ్మ నాన్నలకు తెలుసా? వాళ్ల అనుమతితో నే చేస్తున్నారా? వంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
మరోవైపు నెటి జనుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా వాటన్నింటిపై రకుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది కండోమ్ కథ అయినంత మాత్రాన్న దీని బూతు లా చూడాల్సిన పనిలేదు. ఈ కథలో చాలా మీనింగ్ ఉంది. అతర్లీనంగా బలమైన సందేశం ఇస్తుంది. కండోమ్ అనే దాన్నిబూతుగా అనుకోవడం అనేది కేవలం భామన మాత్రమే.
ఇది కుటుంబ కథా చిత్రం..యువతతో పాటు..తల్లిదండ్రలు అంతా ఒకే చోట కలిసి కూర్చుని చూసే సినిమా ఇది. అశ్లీలతకు..అసభ్యతకు తావు లేకుండా కథని ఎంతో సున్నితంగా చెప్పాం. ఇక ఈ సినిమా చేస్తున్నట్లు ఇంట్లో తెలుసు. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం ఉందని..వాళ్లు సపోర్ట్ లేనిదే ముందుకు వెళ్లలేదని'' తెలిపింది. మరి ఈ కండోమ్ కథ ఎలా ఉంటుందన్నది తెలియాలంటే జనవరి వరకూ వెయిట్ చేయాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.