మంచి కథ.. కాన్సెప్ట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అందులో నటించిన స్టార్ ఎవరు అన్నది కూడా జనాలు చూడరు. సరిగ్గా ఇదే పాయింట్ ఈ యంగ్ హీరోని బాలీవుడ్ లో పెద్ద స్టార్ ని చేస్తోంది. నెప్టోయిజం (నటవారసత్వం) రాజ్యమేలే చోట ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్ డమ్ ని అందుకుంటున్నాడు. వరుసగా రెండు 100కోట్ల క్లబ్ సినిమాల్లో నటించాడు. మూడో వంద కోట్ల క్లబ్ ఎంతో దూరంలో లేదు. డబుల్ హ్యాట్రిక్ అధిగమించి ట్రిపుల్ హ్యాట్రిక్ లక్ష్యంగా ఎదిగేస్తున్నాడు. ఇంతకీ ఎవరా సర్ ప్రైజ్ స్టార్ అంటే ఇంకెవరు.. ఆయుష్మాన్ ఖురానా.
తాజాగా అతడు నటించిన 'బాలా' చిత్రం 100కోట్ల క్లబ్ వైపు దూసుకెళుతోంది. ఆయుష్మాన్ నటించిన రీసెంట్ చత్రాలు బదాయి హో .. డ్రీమ్ గాళ్ 100 కోట్లు పైగా నెట్ వసూలు చేసి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు బాలా చిత్రంతో 100 కోట్ల క్లబ్ హీరోగా హ్యాట్రిక్ అందుకోబోతున్నాడు. ఆయుష్మాన్ నటించిన ఆరు చిత్రాలు వరుసగా విజయాలు సాధించాయి. దీంతో డబుల్ హ్యాట్రిక్ హీరోగా అతడి పేరు మార్మోగుతోంది. ఆయుష్మాన్ దూకుడు చూస్తుంటే ట్రిపుల్ హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ యంగ్ హీరో నటించిన ఆరంభ చిత్రాలు పరిమితంగానే వసూళ్లు సాధించాయి. ఇప్పుడు అతడు ఉన్నాడంటే చాలు వంద కోట్లు వచ్చి పడిపోతున్నాయ్. బాలా చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో అద్భుత వసూళ్లను సాధిస్తోందన్నది బాలీవుడ్ రిపోర్ట్. ఆయుష్మాన్ కెరీర్ లోనే భారీ వసూళ్లు సాధిస్తున్న చిత్రంగా నిలవనుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లోనే 20 కోట్ల వసూళ్ల మార్క్ ను చేరుకుని భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. బట్ట తల నేపథ్యంలో తెరకెక్కిన ఫన్నీ ఎంటర్ టైనర్ ఇది. ఇటీవలే రిలీజైన `ఉజ్డా చమన్` అనే చిత్రం ఈ తరహాలోనే బట్ట తల కాన్సెప్టుతో తెరకెక్కింది. అయితే ఆ సినిమా వచ్చినా దాని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు మరోసారి అదే కాన్సెప్టుతో వచ్చిన బాలా చిత్రాన్ని ప్రేక్షకులు గొప్పగానే ఆదరిస్తుండడం చూస్తుంటే ఆయుష్మాన్ క్రేజు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ని ప్రతిభను నమ్ముకుని ఎదుగుతున్న హీరోగా అతడి పాపులారిటీ స్కైని టచ్ చేస్తోంది.