సలార్ రేంజ్ ను పెంచుతున్న చిన్న హీరో

Update: 2022-11-21 16:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపుని అందుకొని ఆ తర్వాత ఫ్యాన్ ఇండియా అగ్ర హీరోలలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. ఇక అతను ఇప్పుడు కేవలం తెలుగు ఆడియన్స్ కు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న వివిధ రకాల భాషలకు చెందిన ఆడియన్స్ కు కూడా డార్లింగ్ అయిపోయాడు. అంతేకాకుండా సినిమా తారలు కూడా అతనితో ఒక్కసారి వర్క్ చేస్తే చాలు అనుకుంటున్నారు. ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమకు కూడా ప్రభాస్ మరింత దగ్గరవుతున్నాడు.

ఎందుకంటే ఆ సినిమాకు వర్క్ చేస్తున్న టెక్నీషియన్స్ నటీనటులు చాలా వరకు అక్కడి భాషకు చెందిన వారే.ఇక రీసెంట్ గా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న హీరో ప్రభాస్ గురించి అలాగే సలార్ రేంజ్ ను పెంచే విధంగా మీడియా ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి లవర్ బాయ్ గా గుర్తింపు పొందుకుంటున్న ప్రమోద్ మొదట టెలివిజన్ ప్రపంచంలో క్రేజ్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు వరుసగా అతను హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇటీవల అతని సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో ప్రభాస్ గురించి అతనికి ఎక్కువగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఎందుకంటే అతను సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. నా పాత్ర ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది అంటూ.. ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ తో కూడా నా పాత్ర ట్రావెల్ అవుతుంది అని చెప్పాడు.

అంటే హీరోతో పాటు ప్రధానమైన విలన్ దగ్గర కూడా ఈ క్యారెక్టర్ హైలైట్ కాబోతున్నట్లు అనిపిస్తోంది. ప్రమోద్ అయితే ఈ సినిమా చాలా గ్రాండియర్ గా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని అందరూ చెబుతుంటే విన్నాను.

కానీ నేను షూటింగ్లో పాల్గొన్న తర్వాత స్వయంగా తన మంచితనం గురించి తెలిసింది అని అన్నాడు. నిజంగా అతను మంచి డార్లింగ్ అని.. ఎవరైనా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు అని ప్రమోద్ అన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News