'కన్నప్ప'లో డార్లింగ్ డాన్సు కూడా చేస్తున్నాడా?
ప్రభాస్ మినహా మిగతా పాత్రల ఫస్టు లుక్ పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి టాప్ స్టార్లు రంగంలోకి దిగడంతో? సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి. ప్రభాస్ మినహా మిగతా పాత్రల ఫస్టు లుక్ పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ రోల్ ని మాత్రం ఓసస్పెన్స్ గా దాచి పెట్టారు.
సరైన టైమ్ లో పాత్ర..ఫస్టు లుక్ రివీల్ చేసి పాన్ ఇండియా షేక్ అయ్యేలా! ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతకు ముందు ప్రభాస్ పాత్రకు సంబంధించి మరో ఇంట్రెస్టింగప్ అప్ డేట్ వచ్చేసింది. కన్నప్పలో ప్రభాస్ డాన్స్ కూడా చేసారు. ఆయనపై ఓ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. భక్తి నేపథ్యం కావడంతో ప్రభాస్ పై ఆపాట ఒక డివోషనల్ సాంగ్ అని తెలుస్తోంది.
ఈ పాట కూడా ప్రభాస్ ఎంట్రీ సాంగ్ అట. ఈ విషయాన్ని కమెడియన్ ఆది ఓ వీడియోలో లీక్ చేసాడు. ఆ సమయంలో పాట కోరియోగ్రఫీ చేసిన గణేష కూడా అక్కడే ఉన్నారు. ఈ విషయాన్ని మాస్టర్ కూడా సూచన ప్రాయంగా ఒకే చేసారు. దీంతో ప్రభాస్ పోషించే పాత్రపై ఆసక్తి అంతకంతకు రెట్టింపు అవుతుంది. ఇప్పటికే ప్రభాస్ శివుడి పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం లో ఉంది. శివ తాండవం ఆడటం శివుడి ప్రత్యకత.
మరో ఆ పాత్రలో ప్రభాస్ నటిస్తే శివ తాండవం పాటని చిత్రీకరించి ఉంటారని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావడానికి మరింత సమయం పడుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ పాత్రకు సంబంధించిన విషయాన్ని సమయం వచ్చినప్పుడు తానే రివీల్ చేస్తానని విష్ణు ఓ సందర్భంలో అన్నారు. మరి ఆ సమయం ఎప్పుడొస్తుందో చూడాలి.