కరోనా కల్లోలం పరిణామాలు ప్రపంచ దేశాల్ని ఒణికిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్లతో ప్రజా జీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ఆ క్రమంలోనే వైరస్ నేపథ్యంలో సినిమాల్ని యూట్యూబ్ వేదికగా వీక్షించేందుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే 2011లో రిలీజైన హాలీవుడ్ మూవీ `కంటాజియాన్`కి యూట్యూబ్ లో విశేష ఆదరణ లభించింది. వైరస్ ఒకరినుంచి ఒకరికి ఎలా ట్రాన్స్ ఫర్ అవుతుంది? దానిని కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ - ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేశాయి. ఇందులోనే రాజకీయాలు.. దుర్మార్గాలు.. వంటివన్నీ తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.
ఇక కరోనా వైరస్ తరహాలో అంత ప్రమాదకరమైనది కాకపోయినా ఇంతకుముందు కేరళలో ప్రబలిన నిపా వైరస్ పైనా ప్రఖ్యాత దర్శకుడు ఆషిక్ అబూ `వైరస్` పేరుతో అదిరిపోయే సినిమానే తీశారు. ఈ మెడికల్ థ్రిల్లర్ చిత్రానికి జాతీయ అవార్డులు సైతం దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమాని ఆన్ లైన్ లో వీక్షించేవాళ్లు అధికమయ్యారు. ఇక ఇందులో ఏం ఉంది? అంటే.. కేరళను భారత దేశాన్ని కబళించేందుకు దూసుకొస్తున్న నిపా వైరస్ మహమ్మారీ నివారణకు కేరళ ప్రభుత్వం ఎలాంటి కృషి చేసింది? అందుకు కేంద్రంతో ఎలాంటి సమన్వయం చేసుకుంది? స్థానిక వైద్యులు అధికారులు రాజకీయ నాయకులు ఎలా స్పందించారు? అన్న ఇతివృత్తం ఆధారంగా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక రకంగా నిపా వైరస్ ని అతి తక్కువ కాలంలో అంతమొందించేందుకు కేరళీయులు చేసిన అసాధారణ ప్రయత్నం నేటి విపత్కర కరోనా అంతానికి ఎలా ఉపయోగపడుతుంది? అన్న కోణంలో ఆలోచింపజేస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కరోనాని కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం అంతే ఇదిగా కృషి చేస్తోంది. అక్కడ ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టడం పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబూ ఆషిక్ తెరకెక్కించిన `వైరస్` చిత్రం పైనా ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
కేరళ లో నిపా వైరస్ వ్యాప్తిపై 2019 చిత్రం COVID-19 యొక్క వ్యాప్తిని ఎలా సమర్థవంతంగా నిరోధించాలో బ్లూప్రింట్‌ను అందిస్తుందన్న చర్చా మొదలైంది. దేశంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నా.. మలయాళ చిత్రపరిశ్రమకు గౌరవాన్ని తెచ్చి పెడుతున్నవి ఇలాంటి ప్రయత్నాలే. ఈ తరహా సినిమాలేననడంలో ఎలాంటి సందేహం లేదు. `వైరస్` చిత్రం వాస్తవంగా జరిగిన కథ ఆధారంగా రూపొందించబడింది. ఇది జూనాటిక్ (జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది) అనే ఘోరమైన వైరస్ అయిన నిపాతో కేరళ పోరాటానికి సింబాలిక్. 2018లో కేరళ వైరస్ పై పెను యుద్ధానికి దిగిన తీరును చెప్పింది. కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా ప్రజల మధ్య కూడా నిపా రోగం వ్యాపిస్తుంది. గొప్ప పచ్చదనం.. అధిక అక్షరాస్యత రేటు .. ఇతర ప్రగతిశీల మానవ అభివృద్ధి సూచికల విషయంలో భారత్ గర్వించదగ్గ రాష్ట్రం కేరళ. అంత గొప్పగా ఆరాధించే కేరళకే ఇంత కష్టం వస్తే దేశానికి ఇంకేమవుతుందోనన్న టెన్షన్ వ్యక్తమవుతుంది.
నిపా వైరస్ 1998-99లో మలేషియాలో 105 మందిని చంపింది. 1.1 మిలియన్ పందులను నరికివేయమని అధికారులు ఆదేశించాల్సి వచ్చింది. ఇది వాణిజ్య సంబంధాల్ని బలహీనపరిచింది. 2001-2015 మధ్య బంగ్లాదేశ్ లో వివిధ ప్రాంతాలలో 2001 .. 2007 లో భారతదేశంలోనూ డజన్ల కొద్దీ ప్రజల మృతికి నిపా వైరస్ కారణమైంది. ఈ వైరస్ ని గుర్తించిన రెండు దశాబ్దాల తరువాత కూడా వ్యాప్తిని నివారించడానికి ఇంకా వ్యాక్సిన్ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) దీనిని `ప్రాధాన్యతా వ్యాధుల` జాబితాలో చేర్చింది. దీని కోసం వేగవంతమైన పరిశోధన అత్యవసరమని ప్రకటించింది.
కేరళలో అధిక జనాభా సాంద్రత ఉంది. కాబట్టి రెండేళ్ల క్రితం రాష్ట్రంలో నిపా వైరస్ తొలి కేసులను గుర్తించినప్పుడు.. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుందని చాలామంది భయపడ్డారు. ఇది స్థానిక జనాభా.. భారత ఆర్థిక వ్యవస్థ పై విపత్కర పరిణామాలను కలిగిస్తుందని సందేహించారు. ఏదేమైనా రాష్ట్రం వేగంగా అప్రమత్తమైంది. పరిపాలన పరంగా వేగంగా చర్యల్ని చేపట్టింది. జూన్ 2018 లో మొదటి నిపా కేసును గుర్తించిన ఆరు వారాల లోపు రాష్ట్రంలో రెండు ప్రభావిత జిల్లాలను మాత్రమే నిపా రహితంగా ప్రకటించారు. అప్పటికి పదిహేడు మంది మరణించారు. కాని స్థానికంగా వ్యాప్తి చెందకుండా అంటువ్యాధిగా మారకుండా స్థానిక ప్రభుత్వ కృషి భారతదేశం సహా విదేశాలలో ప్రశంసలు అందుకుంది.
ఆశిక్ అబూ దర్శకత్వం వహించిన వైరస్ చిత్రంలో వీటన్నిటినీ సమర్థంగా చూపించారు. ముహ్సిన్ పారారి- షార్ఫు - సుహాస్ కలం నుంచి ఈ కథ తయారైంది. ఇందులో ప్రభుత్వాల క్లినికల్ సామర్థ్యాన్ని వివరించారు. రాజకీయ నాయకులు- అధికారులు- ఆరోగ్య సంరక్షణ సోదరభావం- పారిశుధ్య కార్మికులు మరియు ప్రజలు ఈ విషాదాన్ని మొగ్గలోనే తుంచేయడానికి ఎలా చేతులు కలిపారో చూపించారు.
ఇక `వైరస్` మలయాళ చిత్రం 2011 హాలీవుడ్ చిత్రం కంటాజియాన్ కి చాలా డిఫరెంట్. కరోనా వైరస్ ఖండాలలో క్రమంగా తన పట్టును విస్తరించడం ప్రారంభించినప్పటి నుండి ప్రపంచమంతా ఎలా చుట్టేసిందో ఆ హాలీవుడ్ చిత్రంలో చూపిస్తే.. మహమ్మారి సమయంలో చెడు సంభవించినప్పుడు ప్రజలు భయపడకూడదని `వైరస్` మూవీ చెబుతుంది. మా చిత్రం ద్వారా ప్రజలకు భయపెట్టకుండా ఆశను కలిగించాలని భావించామని దర్శకుడు వెల్లడించారు. 2018 లో నిపాపై కేరళ ప్రభుత్వం చూపిన స్పందనను న్యూస్ మీడియా విస్తృతంగా వివరించారు. దర్శకుడు అబు అతని బృందం గొప్పగా వైరస్ పై శోధించారు. అధికారులు- వైద్య నిపుణులు- కేరళ ఆరోగ్య మంత్రి- శాస్త్రవేత్తలు వంటి ఎన్నో విషయాల్ని వైరస్ లో చూపించారు. ఇతర నిజ జీవిత పాత్రలను కలిసేందుకు చాలా నెలలు ఎదురు చూసి కథను రాసుకున్నారు. అబూ తన చిత్రంలో.. కేరళలో వాస్తవానికి ఏం జరిగిందో సినిమాగా మలుచుకున్నారు అంతే. రాష్ట్ర నాయకులు .. వైద్య నిపుణులు వైరస్ బారిన పడిన వారితో ఎలా వ్యవహరించారో.. వ్యాధికి గురైన వ్యక్తులను గుర్తించి.. నిర్బంధించిన వ్యక్తులను ఎలా ప్రశ్నిస్తూ పరిశోధించారో.. వారిపై దర్యాప్తు ఎలా సాగించారో తెరపై చూపారు. పేషెంట్ కు లింకులు.. వైరస్ అసలు మూలాన్ని ఎంతో శ్రమతో గుర్తించి.. కొత్త ఇన్ఫెక్షన్ రాకుండా నివారించే చర్యలు ఎలా చేపట్టారో చూపారు తెరపై. అదే సమయంలో న్యూ దిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో కేరళ సమన్వయం చేసుకున్న తీరును వివరించారు. అందుకే కరోనా వైరస్ మహమ్మారి సమయంలో.. `వైరస్` నుండి నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయని చెప్పొచ్చు.
కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీని చూడటం మనకు అర్థం చేసుకోవటానికి సహాయ పడుతుంది. అసలు వైరస్ కథ పుట్టుకకు కారణమైన ఒక నర్సు గురించి దర్శకుడు ఆసక్తికర వివరాల్ని తెలిపారు. కేరళకు చెందిన మొట్టమొదటి నిపా రోగులకు చికిత్స చేసి మరణించిన 28 ఏళ్ల నర్సు లిని పుతుస్సేరీ కథ ఈ మూవీలో ఎమోషన్ ని కలిగిస్తుంది. రోగి నుంచి తనకు వైరస్ సోకి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పుతుస్సేరీ తన భర్తకు రాసిన హత్తుకునే వీడ్కోలు నోట్ అప్పట్లో జాతీయ వార్తాపత్రికలు వెబ్‌సైట్ లలో ప్రచురితమైంది. సోషల్ మీడియాలో పుతుస్సేరీ గురించి చదివినప్పుడు కేరళ యొక్క నిపా వ్యాప్తి కథకు తాను మొదట ఆకర్షితుడయ్యానని దర్శకుడు అబూ చెప్పారు. కేరళ ప్రజల హృదయాలను ఆకర్షించిన ఒక నర్సు యొక్క బాధలు త్యాగాల చుట్టూ ఈ చిత్రాన్ని నిర్మించడం ఉత్కంఠను కలిగించిందని తెలిపారు. వైరస్ చిత్రంలో నటి రేవతి కేరళ ఆరోగ్య మంత్రి సి.కె.ప్రమీలా పాత్రను పోషించారు. నిజ జీవిత కేరళ ఆరోగ్య మంత్రి కె.కె.శైలజా ఆధారంగా 2018 లో రాష్ట్ర నిపా వ్యతిరేక టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహించిన రియల్ అధికారి పాత్ర అది. రేవతి నటనపైనా ప్రశంసలు కురిశాయి. రిమా కళింగల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్న వైరస్ ని వీక్షించేందుకు ఎందుకు ఇంకా ఆలస్యం. వెంటనే చూసేయండి మీరు కూడా.