బిగ్ ట్విస్ట్: జయం రవి దంపతులు మళ్లీ కలుస్తున్నారా?
తమిళ నటుడు జయరవి -ఆర్తీ దంపతులు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు ఫ్యామిలీ కోర్టులో ఉంది
తమిళ నటుడు జయరవి -ఆర్తీ దంపతులు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు ఫ్యామిలీ కోర్టులో ఉంది. ఇటీవలే విచారణకు రాగా? ఇద్దరు పునరాలోచించుకోవాలని..కొంత కాలం పాటు కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోర్టు అదేశించింది. సయోధ్య కేంద్రంలో మధ్యవర్తిత్వానికి హాజరు కావాలని దంపతులకు కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఇద్దరు తాజాగా అక్కడ హాజరయ్యారు. మధ్య వర్తితో పాటు ఒక గంటపాటు చర్చ సాగింది.
ఈ క్రమంలో ఇద్దరు సానుకూలంగా స్పందించి మాట్లాడుకున్నారుట. ఎలాంటి ఆందోళన లేకుండా ఒకరి అభి ప్రాయాలు ఒకరు పంచుకున్నట్లు సమాచారం. పిల్లల కోసమైనా కలిసి జీవించాలనే ఆలోచన పడ్డట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో వాళ్లిద్దరు మళ్లీ కలిసి జీవిస్తారనే ప్రచారం ఊపందుకుంది. కోర్టు ఇచ్చిన గడువుకు ఇంకా సమయం ఉంది. ఈలోగా ఇద్దరు ఒకర్ని ఒకరు అర్దం చేసుకుని కలుసుకుంటే? అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నిపుణలు భావిస్తున్నారు.
మరి తుదిగా ఏం జరుగుతుంది? అన్నది చూడాలి. సెప్టెంబర్ లోనే జయం రవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్తీ తన ప్రమేయం లేకుండా ప్రకటిచడం ఏంటని తప్పుబట్టింది. ప్రతి గా రవి లాయర్ ద్వారా నోటీసులు పంపామని, ఈ విషయం ఆర్తీ తల్లిదండ్రులకు తెలుసునని...పెద్దలంతా చర్చిం చుకున్న తర్వాతే నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
తాజాగా ఫ్యామిలీ కోర్టు ఆదేశాల మేరకు హాజరైన కౌన్సిలింగ్ లో పురోగతి కనిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది. 2009లో జయం రవి-ఆర్తీ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా కలరు.