సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కొత్త మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మనేషిందే డిమాండ్ చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా `ముందుగా నిర్ణయించిన ఫలితాలను` చేరుకోవడానికి ఏజెన్సీ(విచారించే వారి)పై ఒత్తిడి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
“సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని ఫోరెన్సిక్ బృందంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుడు 200శాతం తీర్మానం కేవలం ఛాయాచిత్రాల ఆధారంగా వెల్లడించడం ప్రమాదకరమైన ధోరణి. పరిశోధనలను నిష్పాక్షికంగా సాగించడానికి సిబిఐ కొత్త మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి. రాబోయే బీహార్ ఎన్నికల దృష్ట్యా స్పష్టమైన కారణాల వల్ల ముందుగా నిర్ణయించిన ఫలితాన్ని చేరుకోవడానికి ఏజెన్సీలపై ఒత్తిడి చేస్తున్నారు. డిజి (గుప్తేశ్వర్) పాండే VRS ఇచ్చేయడాన్ని ఇటీవలే మనం చూశాము. అలాంటి ప్రకోపాల్ని పునరావృతం చేయకూడదు” అని మనేషిందే అన్నారు.
రాజ్ పుత్ కుటుంబ న్యాయవాది వికాస్ సింగ్ చేసిన ట్వీట్ పై మనే షిందే స్పందించారు. ``సిబిఐ ఆలస్యం కారణంగా విసుగు చెంది.. ఆత్మహత్యను కాస్తా హత్యగా మార్చడానికి నిర్ణయం తీసుకుంటుంది. ఎయిమ్స్ బృందంలో భాగమైన వైద్యుడు చాలా కాలం క్రితం నాకు పంపిన ఫోటోలు 200శాతం అది గొంతు పిసికి చంపడమే. అది ఆత్మహత్య కాదనిపించిందని చెప్పారు ” అని ఆయన ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
దర్యాప్తు దారి తప్పినందుకు దివంగత నటుడు రాజ్‌పుత్ కుటుంబం నిరాశకు గురైందని గురువారం విలేకరుల సమావేశంలో సింగ్ చెప్పారు. ``నిజం బయటకు రాకుండా దర్యాప్తు జరుగుతోందని కుటుంబం భావిస్తుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కేసు ముంబై పోలీసుల దర్యాప్తులాగా మారింది. ఇప్పుడు స్టార్లందరినీ పిలుస్తున్నారు. ఇది సరైన విచారణ కాదు. సిండికేట్ (బాలీవుడ్ మాఫియా)లో ఒక భాగం. ఇది ముంబై పోలీసుల దర్యాప్తు మాత్రమే. వార్తా సంస్థ ANI ప్రకారం.. సుశాంత్ కేసు డ్రగ్స్ కేసు ముందు పూర్తిగా వీగిపోవడం ఖాయం. అది బ్యాక్ బెంచ్ కే పరిమితమవుతుంది..`` అని సింగ్ ఒక వాదన వినిపించారు.