షాకింగ్ వీడియో: తళా అజిత్ రేసింగ్ కార్ ప్రమాదం
ప్రమాదంలో రేస్ కార్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అజిత్ కి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటంతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
తళా అజిత్ కుమార్ వృత్తి వేరు.. ప్రవృత్తి వేరు. ఆయన భారతదేశంలోని పాపులర్ మాస్ హీరోల్లో ఒకరు. సూపర్‌స్టార్ గా తమిళ పరిశ్రమను ఏల్తున్నారు. రజనీకాంత్, విజయ్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్. వీటన్నిటినీ మించి అతడి డౌన్ టు ఎర్త్ నేచుర్ అందరి మనసులను గెలుచుకుంటుంది. తళా సినిమాల్లోకి రాక ముందు రేసర్. బైక్ రేసింగ్.. కార్ రేసింగ్ వంటి అడ్వెంచర్స్ లో పాల్గొన్నాడు.
ఇప్పుడు 24H దుబాయ్ 2025 ఎండ్యూరెన్స్ రేస్‌కు ముందు దుబాయ్‌లో హై స్పీడ్ రేసింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. అయితే అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. రేసింగ్ పోటీకి ప్రీప్రిపరేషన్ లో ఈ సంఘటన జరిగింది. కార్ నేరుగా సైడ్ రిటైనింగ్ వాల్ ని ఢీకొట్టడంతో అది రోడ్ పైనే గింగిరాలు తిరిగింది. అదృష్టవశాత్తూ అది తిరగబడలేదు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఫైర్ వింగ్ కార్ నుంచి పోలీస్ కార్ లోంచి అజిత్ ని బయటకు తీసుకువచ్చారు. తళా అజిత్ ఈ ఘటనతో భయపడినట్టు కనిపించలేదు. దీనిని అతడు క్యాజువల్ ప్రమాదంగా తీసుకున్నాడు. రేసింగ్ కోర్స్ కి తగ్గట్టే అతడు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతతో ఉన్నాడు.
ప్రమాదంలో రేస్ కార్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అజిత్ కి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటంతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కారును ప్రస్తుతం మరమ్మతులకు పంపారని సమాచారం. జనవరి 9 నుండి 12 వరకు దుబాయ్‌లో జరగనున్న రేస్ లో పాల్గొనేందుకు సిద్ధమైన అజిత్ కి తన భార్య షాలిని ఘనంగా ప్రిపరేషన్ చేయించి పంపిన ఫోటోలు ఇంతకుముందు వెబ్ లో వైరల్ అయ్యాయి. అయితే ప్రాక్టీస్ సెషన్స్ లో ఈ ప్రమాదం ఊహించనిది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆన్‌లైన్‌లో కనిపించడంతో అభిమానులు , రేసింగ్ ఔత్సాహికులు షాక్ అయ్యారు. ఈ సంఘటన జరిగినప్పటికీ అజిత్ కుమార్ ఉత్సాహంగా ఉన్నారని పోటీకి సై అంటూ దూసుకెళుతున్నారని అభిమానులు భావిస్తున్నారు. మొదటి ప్రాక్టీస్ సెషన్, టీమ్ డిస్కషన్‌ల ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఫ్యామిలీతో సింగపూర్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని చెన్నైకి తిరిగి వచ్చిన అజిత్ రేసింగ్ లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లాడు. ఈ ఛాలెంజింగ్ ఈవెంట్ లో అజిత్ సాహసాలను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. రేసింగులో పాల్గొంటున్న అజిత్ అండ్ టీమ్ కి బలమైన స్పాన్సర్ అండదండలు ఉన్నాయి.