క్రిష్ దర్శకత్వం వహించిన ఓ సినిమాని దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతికి ప్రదర్శించనున్నారు.. ఇంతకీ ఏ సినిమా అది? ఈ ప్రశ్నకు సమాధానం ఇదిగో...
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన ఓ సినిమాని రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి కోసం ప్రదర్శించనున్నారు. ఆ సినిమా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన `ఎన్టీఆర్- కథానాయకుడు` అనుకుంటే తప్పులో కాలేసినట్టే. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మనసుపడి.. చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా వేరొకటుంది... గ్రేట్ వారియర్ క్వీన్ ఝాన్సీ రాణి జీవితకథను ఆయన తెరపై చూడాలనుకుంటున్నారు. కంగన రనౌత్ నటించిన `మణికర్ణిక` కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారట. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని చూసిన రాష్ట్రపతి ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగన నటనకు ముగ్ధులయ్యారట. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని వీక్షించాలనే కోరికను ఆయన బయటపెట్టారట. ఆయన కోరిక మేరకు చిత్ర బృందం శుక్రవారం రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
రాష్ట్రపతి దంపతులతో పాటు పలవురు రాజకీయ నాయకులు - చిత్ర బృందం పాల్గొననున్నారని తెలిసింది. 80 శాతం సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాక - మిగతా 20 శాతం కంగన డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటుపై క్రిష్ అలక పానుపు ఎక్కిన సంగతి విదితమే. ఎన్టీఆర్ బయోపిక్ గురించి తెలిసిన తరువాత ఆ చిత్రాన్ని మధ్యలోనే వదిలేసిన క్రిష్ బయటికి వచ్చేశాడు. దీంతో మిగతా భాగాన్ని పూర్తి చేసే బాధ్యతల్ని కథానాయిక కంగన తీసుకుని విజయవంతంగా పూర్తిచేసింది. `మణికర్ణిక` చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. విడుదలకు వారం ముందే రాష్ట్రపతి కోసం ప్రదర్శిస్తుండటం ఇదే ప్రధమం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Full View