పవిత్రా లోకేష్ ను నాలుగో వివాహం చేసుకోవడానికి ప్రస్తుతం సహజీవనం చేస్తున్న నరేష్ వివాదం మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమపై జరుగుతున్న ట్రోలింగ్ ను ఆపాలంటూ ఈ జంట పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ ఫొటోలు, అసభ్య పదజాలంతో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నరేశ్-పవిత్రా సైబర్ క్రైం పోలీసులు ఆశ్రయించారు. దీంతో పోలీసులు పలు యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.
నటుడు నరేశ్ తాజాగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తమను ట్రోలింగ్ చేస్తోన్న కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, కొంతమంది వ్యక్తులపై ఆయన క్రిమినల్ డిఫర్మేషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు పవిత్ర-నరేశ్ లపై ట్రోలింగ్ కు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానెళ్లు, వ్యక్తులపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై వారికి నోటీసులు కూడా జారీ చేశారు.
కొద్దిరోజులుగా నరేశ్-పవిత్రా లోకేష్ ల బంధంపై తీవ్ర చర్చ సాగుతోంది. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమను దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటూ పలు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఈ ట్రోల్స్ వెనుక నరేశ్ మూడో భార్య రమ్య కూడా ఉందంటూ ఆమె ఫిర్యాదు చేశారు.
నరేశ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరిలో మూడో భార్యతో ఆయన మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఆమె కొందరి దగ్గర అధిక వడ్డీ ఇస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేయడంతో నరేశ్ దూరం పెట్టారు. ఈ సమయంలో నరేశ్ పేరు కూడా మీడియాలో రావడంతో ఆమెతో తనకు సంబంధం లేదని, తనతో దూరంగా ఉంటున్నానని క్లారిటీ ఇచ్చారు. అయితే వీరు ఇంకా విడాకులు తీసుకోలేదు.
తర్వాత తన సహనటి అయిన పవిత్రా లోకేష్ తో నరేశ్ సహజీవనం చేస్తున్నాడు. ఆమె కూడా భర్తకు దూరంగా ఉంటోంది. ఇద్దరి విడాకులు క్లియర్ అయ్యాక ఈ జంట అధికారికంగా పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కలిసి ఉంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.