పసిపాప‌లా గెంతులేస్తున్న‌ క‌మ‌ల్ హాస‌న్

Update: 2023-01-02 05:31 GMT
లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ 'విక్రమ్' రూపంలో అద్భుత‌మైన‌ బ్లాక్ బస్టర్ సాధించాడు. 2022 మైండ్ బ్లాకింగ్ మూవీతో అత‌డు స్ట‌న్న‌ర్ గా మారాడు. విశ్వ‌నటుడి నుంచి ఔట్ పుట్ తీసుకునే మొన‌గాడంటి దర్శ‌కుడు చాలా కాలానికి త‌గిలాడ‌ని చెప్పాలి. ది గ్రేట్ లోకేష్ క‌న‌గ‌రాజ్ విక్ర‌మ్ సినిమాని తెర‌కెక్కించిన తీరు ఒక అద్భుతం. సంభాష‌ణ‌ల ప‌రంగా స్క్రీన్ ప్లే ప‌రంగా మిరాకిల్స్ చేశాడ‌ని చెప్పాలి.

విక్ర‌మ్ ఇప్పటివరకు అతడి కెరీర్ లోనే అతిపెద్ద హిట్ చిత్రం. కమల్ హాసన్ అసాధారణమైన నటుడే అయినా చాలా కాలంగా స‌రైన ఎంపిక‌లు కుదర‌క బ‌డ్జెట్ల క్రైసిస్ కార‌ణంగా వాణిజ్యపరంగా అత‌డి సినిమాలు విజయం సాధించలేదు. విక్రమ్ తో ఈ గ్యాప్ కి ముగింపు పలికాడు. ఇక‌పై విక్ర‌మ్ ఫ్రాంఛైజీతో దుమ్ము దుల‌పాల‌నే ప్ర‌ణాళిక‌తో ఉన్నాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌స్తుత క‌మిట్ మెంట్లు పూర్త‌యి తిరిగి లోక‌నాయ‌కుడిని క‌లుసుకుని విక్ర‌మ్ 2 బౌండ్ స్క్రిప్టును వినిపిస్తాడ‌ని తెలిసింది.

కమల్ హాస‌న్ లేటెస్ట్ మూవీని గుర్తు చేస్తూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నూతన సంవత్సర శుభాకాంక్షలు పోస్ట్ చేశారు. కమల్ తన ఎగ్జ‌యిట్ మెంట్ తో చిన్న‌పాటి హింట్ ఇచ్చేలా ఓ ఫోటోని షేర్ చేసాడు. అతడు ఈ ఫోటోలో ఒక‌ చిన్నపిల్లవాడిలాగా నూతన సంవత్సరాన్ని ఆస్వాధించాడ‌ని దాని అర్థం. కమల్ ఎప్పటికీ యంగ్ మ్యాన్.. ట్రెండీగా ఆలోచిస్తారు. ఏదో ఒక‌రోజు ఆస్కార్ ల‌ను మ‌న‌మే ఇచ్చేంత‌గా సౌత్ ని తీర్చిదిద్దే గురువు అవుతాడ‌ని ఆశిద్దాం.

క‌మ‌ల్ హాస‌న్ తదుపరి మణిరత్నం తెర‌కెక్కించే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించనున్నాడు. ఈ చిత్రం క‌మ‌ల్ కెరీర్ లో 234వ చిత్రం. ఇటీవలే ఈ ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి సహ నిర్మాతలలో కమల్ ఒకరు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే కమల్ ముందుగా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 ని పూర్తి చేసి రిలీజ్ చేయించాల్సి ఉంది. దీనిని లైకా ప్రొడ‌క్ష‌న్స్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News