'చనిపోదామంటే.. ఆ అమ్మాయి ఆపింది'!

Update: 2020-04-03 12:10 GMT
టాలీవుడ్ లో పేరుమోసిన సినీ రచయితల లో కోన వెంకట్ ఒకరు. దాదాపు 20యేళ్ళ సినీ చరిత్ర కలిగిన ఆయన సినీ జీవితంలో ఎన్నో కష్టాలను దాటి ఈరోజు మేటి స్థాయి రచయితలలో ఒకడిగా పేరొందుతున్నారు. కోన వెంకట్ నిజానికి గొప్ప కుటుంబం నుండే వచ్చినా సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ఎన్నో ఆటుపోట్లను భరించాడట. ఒకప్పుడు తిండి లేక అవకాశాల కోసం తిరిగిన ఆయన ఈరోజు తిరుగులేని స్టార్ రైటర్ గా ఇండస్ట్రీలో నిలదిక్కుకున్నాడు. జీవితంలో కొన్ని సినిమాలు జీవితాన్నిస్తే.. కొన్ని సినిమాలు జీవితాన్ని కల్లోలం చేస్తాయంటున్నారు కోన వెంకట్. మొదట్లో సినీ నిర్మాతగా సెటిల్ అవుదామనుకున్న వెంకట్ 'తోకలేని పిట్ట' అనే సినిమాను నిర్మించి నష్టపోయాడు.

ఉన్న డబ్బు మొత్తం పోవడం తో దిక్కుతోచక ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందట. అదే సమయంలో జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోదామని నిశ్చయించుకుంటే తను చూసిన ఒక సంఘటన తన జీవితాన్నే మార్చేసింది అంటున్నారు కోన వెంకట్. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ సంఘటన గురించి మాట్లాడుతూ.. ఒక అబ్బాయి తోపుడు బండి మీద రెండు కాళ్ళు లేని అమ్మాయిని కుర్చోబెట్టుకొని తోసుకుంటూ వెళ్తున్నాడట. అలా వెళ్తున్న వాళ్ళిద్దరికీ జనాలు డబ్బులిస్తే ఆనందంగా తీసుకొంటున్నారట. ఇదంతా గమనించిన కోన వెంకట్.. తన సూసైడ్ ఆలోచన మానుకొన్నాడట. కాళ్ళు లేని ఆ అమ్మాయే అంత సంతోషంగా ఉంది. అన్నీ బాగున్న నేనెందుకు చనిపోవాలి అని అనుకోని రామ్ గోపాల్ వర్మతో ముంబైకి వెళ్ళిపోయాడట. ప్రస్తుతం వెంకట్ తెలుగు ఇండస్ ట్రీలో హైయెస్ట్ పేయింగ్ రైటర్ గా కొనసాగుతున్నాడు.
Tags:    

Similar News