బాలయ్య కోసం బాబి ఆ లాజిక్!
వశిష్ట దర్శకత్వం వహించిన ఆ సినిమాలో చిన్నారి సెంటిమెంట్తోనే హిట్ అందుకున్నాడు కల్యాణ్ రామ్.
నందమూరి వారసులకు చిన్నారుల సెంటిమెంట్ బాగానే కలిసొస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. బాలకృష్ణ, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు ఈ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. `పటాస్` తర్వాత కల్యాణ్ రామ్ కి సరైన సక్సెస్ పడలేదు. `118` చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా భారీ లాభాలు రాలేదు. దీంతో కల్యాణ్ రామ్ మళ్లీ వెనుక బడుతున్నాడనే ప్రచారం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో `బింబిసార`తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
వశిష్ట దర్శకత్వం వహించిన ఆ సినిమాలో చిన్నారి సెంటిమెంట్తోనే హిట్ అందుకున్నాడు కల్యాణ్ రామ్. అటుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `ఆర్ ఆర్ ఆర్` కథకు కీలక పాయింట్ చిన్నారి అంశమే. గోండు తెగకు చెందిన చిన్నారి బ్రిటీషర్ల చెర నుంచి విడిపించడం కోసం తారక్ తపించిన విధానమే సినిమాను పీక్స్ కు తీసుకెళ్లింది. ఇక నటసింహ బాలకృష్ణకు అయితే ఏకంగా రీసెంట్ రెండు రిలీజులు అదే సెంటిమెంట్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసారు.
`అఖండ` చిత్రంలో చిన్నారి సెంటిమెంట్ హైలైట్. అటుపై రిలీజ్ అయిన `భగవంత్ కేసరి`లోనూ చిన్నారి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. సినిమాలో ఆ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి చిత్రం `డాకు మహారాజ్` లోనూ అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు బాబి రివీల్ చేసాడు. గత రెండు చిత్రాల్లో బాలయ్య బాబుకు ఆ సెంటిమెంట్ బాగా కలిసొచ్చిందన్నారు.
దీంతో అదే లాజిక్ తో మహారాజ్ ని బాక్సాఫీస్ బరిలోకి దించుతున్నాడు బాబి. కథని కమర్శిలైజ్ చేయడంలో బాబి దిట్ట. కాబట్టి `డాకు మహారాజ్` లో పాప సెంటిమెంట్ సన్నివేశాలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఆ సెంటి మెంట్ సన్నివేశాల్ని పీక్స్ లో చూపించి హిట్ అందుకునే స్ట్రాటజీతో ముందుకొస్తున్నట్లు కనిపిస్తుంది.