గేమ్ ఛేంజర్.. బడ్జెట్, టార్గెట్ లెక్కల సంగతేంటి?
ప్రొడక్షన్ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలిపి గేమ్ ఛేంజర్ బడ్జెట్ రూ.500 కోట్లకు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. తెలుగమ్మాయి అంజలి ముఖ్య పాత్ర పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు.. భారీ బడ్జెట్ తో నిర్మించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పుడు సినిమా బడ్జెట్, టార్గెట్ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే శంకర్.. తన సినిమాల సెట్స్ అండ్ సాంగ్స్ కోసం భారీగా ఖర్చు చేస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.
ప్రొడక్షన్ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలిపి గేమ్ ఛేంజర్ బడ్జెట్ రూ.500 కోట్లకు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే గేమ్ ఛేంజర్ రైట్స్ ను మేకర్స్.. ఇప్పటికే జీ కి విక్రయించినట్లు తెలుస్తోంది. కానీ డీల్ విషయంలో రీసెంట్ గా మార్పులు చేర్పులు జరిగినట్లు సమాచారం. చివరగా రూ.200 కోట్లకు డీల్ ఓకే అయిందట.
దాని బట్టి చూస్తే.. థియేట్రికల్ రన్ నుంచి గేమ్ ఛేంజర్ రూ.300 కోట్ల రాబట్టాల్సి ఉందని అర్ధమవుతుంది. బ్రేక్ ఈవెన్ పూర్తి కావాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.120 కోట్లు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తమిళ, కన్నడ, ఓవర్సీస్, నార్త్ లో రూ.150-180 కోట్లు వసూలు చేయాలని అంటున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓకే అయినా.. బీ టౌన్ లో గేమ్ ఛేంజర్ ఎలా ఆడుతుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. హిందీ మార్కెట్ లో భారీ వసూళ్లు రాబడితే.. సినిమాకు ఓ రేంజ్ లో లాభాలు కచ్చితంగా వస్తాయి. సాలిడ్ గా ఉంటే.. ఫైనాన్సియల్ గా ఎలాంటి రిస్క్ ఉండదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక నిర్మాత దిల్ రాజు.. తన మూవీని తానే రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసే యోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో ఆయనే పంపిణీ చేయనున్నారు. మిగతా ప్రాంతాల్లో తనకు బాగా సుపరిచితులైన డిస్ట్రిబ్యూటర్లు.. రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అన్ని డీల్స్ ఖరారు అయిపోయినట్లు సమాచారం. మరి గేమ్ ఛేంజర్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.