వివాదం లేనిదే శింబు లేడు. కాంట్రవర్సీ అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఇదీ అభిమానుల్లో ఉన్న టాక్. అతడు ఎంత గొప్ప ప్రతిభావంతుడో అంతకుమించి వివాదాస్పదుడు అన్న చర్చ నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఒక రకంగా అతడి కెరీర్ తీవ్ర సంక్షోభంలో పడటానికి కారణం ఈ వివాదాలే. కెరీర్ ఆరంభమే నయనతారతో ప్రేమాయణం, అటుపై బ్రేకప్ అతడిపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఆ తర్వాత హన్సికతో లవ్ ఎఫైర్ వీగిపోవడం మరో మైనస్. ఆ రెండు సందర్భాల్లో శింబు పర్సనల్ గా డిస్ట్రబ్ అయ్యాడు. పలు వేదికలపై తానే ఆ విషయాన్ని చెప్పాడు.
మరోవైపు నిర్మాతలతోనూ శింబు గొడవలు రచ్చకెక్కడం - అటుపై నిర్మాతల మండలి - నడిగర సంఘంలో ఫిర్యాదులు అందడంతో ఇండస్ట్రీ నుంచి నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. గత ఏడాది నిర్మాత మైఖేల్ రాయప్పన్ శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడంతో అప్పుడే రెడ్ కార్డ్ జారీ అయ్యింది. శింబు క్రమశిక్షణా రాహిత్యం వల్లనే తాను తీవ్రంగా నష్టపోయానని, `ఏఏఏ` (ఆదిక్ రవిచంద్రన్ దర్శకుడు) సినిమా ఫ్లాపవ్వడానికి అతడే కారణమనేది రాయప్పన్ ఆరోపణ. శింబు 20 కోట్ల కాంపన్సేషన్ చెల్లించాలని ఇప్పటికీ రాయప్పన్ డిమాండ్ చేస్తున్నాడు.
తాజాగా రాయ్యప్పన్ నడిగరసంఘం (ఆర్టిస్టుల సంఘం)లోనూ శింబుపై ఫిర్యాదు చేశాడు. 60 రోజుల కాల్షీట్లు ఇచ్చిన శింబు తన సినిమాకి కేవలం 27 రోజులు మాత్రమే పని చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పంచాయితీ నడుస్తోంది. ఇదే సమయంలో శింబు నటించిన `నవాబ్` (చెక్క చివంత వానమ్) రిలీజ్ కి రెడీ అవుతోంది. అరవింద స్వామి - శింబు తదితరులు నటించిన ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. మరోవైపు సుందర్.సి దర్శకత్వంలో `అత్తారింటికి దారేది` రీమేక్ లోనూ శింబు నటిస్తున్నాడు. అయితే ఎంతో భవిష్యత్ ఉన్న శింబు ఇలాంటి గొడవల లొల్లి పెట్టుకోకుండా కెరీర్‌ని ట్రాక్‌లో పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. రజనీ - సూర్య - విక్రమ్ తర్వాత గొప్ప పేరు తెచ్చుకున్న యువనటుడు ఇకనైనా కాంట్రవర్శీలకు ఫుల్ స్టాప్ పెడతాడేమో చూడాలి.