యువ‌హీరోతో కుర్ర‌బ్యూటీ నిశ్చితార్థం?

Update: 2021-05-14 08:15 GMT
యువ‌నాయిక తారా సుతారియా ప్రేమాయ‌ణం గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. యువహీరో ఆధార్ జైన్ తో తారా డీప్ ల‌వ్ లో ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది.

ఆధార్ జైన్ - తారా సుతారియా వారి సంబంధంపై ఇటీవ‌ల ప్ర‌తిదీ ఓపెన్ గానే ఉన్నారు. ఆ ఇద్ద‌రూ రహస్యంగా దేనినీ దాచ‌డంలేదు. ఆమె త‌న‌ సోదరుడి వివాహానికి హాజరైన తరువాత ఇద్దరూ గత ఏడాది చివర్లో తన పుట్టినరోజున ఇన్ స్టాగ్రామ్ లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అప్పటి నుండి వీరిద్దరూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పిడిఎలో అభిమానుల‌కు రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉన్నారు.

``నా గురించి .. తారా గురించి నేను చెప్పేది ఏమీ లేదు. మేము చాలా సంతోషకరమైన స్పేస్ లో ఉన్నాం ``.. అని ఇంత‌కుముందు ఓ చాట్ సెష‌న్ లో ఆధార్ అన్నారు. నిశ్చితార్థం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అని అడిగినప్పుడు ప్ర‌స్తుతానికి ఈ సంతోషం ఇలానే కొన‌సాగిద్దాం అని స‌మాధాన‌మిచ్చాడు.

ఆధార్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నాడు. అతడు వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నాడు. ప్రేయ‌సితో క‌లిసి ఏదైనా సినిమాలో న‌టించే అవ‌కాశం ఉందా? అని ఆధార్ ని ప్ర‌శ్నిస్తే... తప్పకుండా అని అన్నాడు. ``ఫిలిం మేకర్స్ ప్రకటించే వరకు నేను ఏమీ చెప్పలేను..`` అని అన్నాడు. ఆధార్ చివరిసారిగా `హలో చార్లీ` అనే చిత్రంలో న‌టించాడు.  హీరో పంథి 2-త‌డ‌ప్- ఏక్ విల‌న్ రిట‌ర్న్స్ వంటి క్రేజీ చిత్రాల్లో తారా సుతారియా న‌టిస్తూ బిజీగా ఉంది.
Tags:    

Similar News