రెండు బుర్రలతో కొత్త ప్రయోగం

Update: 2019-03-09 09:59 GMT
డబ్బింగ్ ఫ్యామిలీగా పేరున్న కుటుంబం నుంచి వచ్చి సాయి కుమార్ వారసుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆది సాయి కుమార్ కు డెబ్యు మూవీ మంచి హిట్ అయినా ఆ తర్వాత ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలవలేకపోయింది . కుర్రాడిలో ఒడ్డు పొడవు అన్ని ఉన్నా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల భారీ మూల్యమే దక్కించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆది రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఒకటి ఆపరేషన్ గోల్డ్ ఫిష్. కాశ్మీరీ పండిట్ల నేపధ్యంలో రూపొందిన ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలై మంచి స్పందనే దక్కించుకుంది. ఇది కాకుండా అది చేస్తున్న మరో మూవీ బుర్రకథ. హాస్య చిత్రాల రచయితగా పేరున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా డెబ్యు చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ కు వెళ్లేందుకు రెడీగా ఉంది. ఇది ఏ జానర్ అనేది బయటికి చెప్పకుండా జాగ్రత్త వహించిన టీం త్వరలో ప్రచారం మొదలుపెట్టబోతోంది

విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో హీరో పుట్టడమే రెండు బుర్రలతో పుడతాడట. ఒక బుర్ర ఆలోచనకు మరో బుర్ర చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేకుండా వెరైటీ లైన్ తో ఇది సాగుతుందని తెలిసింది. కవల సోదరుల కథలు కామనే కాని మరీ విధంగా కవల బుర్రల కథ అంటే మాత్రం నిజంగా డిఫరెంట్ అనే అనిపిస్తోంది. హీరోకు ఏదో ఒక లోపం ఉండటం అనే ట్రెండ్ నాని భలే భలే మగాడివోయ్ ఏ ముహూర్తంలో క్లిక్ అయ్యిందో కాని ఇక అప్పటి నుంచి ఈ సిరీస్ లో సినిమాలు వస్తూనే ఉన్నాయి.కాకపోతే బెడిసికొడుతున్నవే ఎక్కువ. ఇప్పుడీ బుర్రకథతో పాటు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కూడా వైవిధ్యమైన సబ్జెక్ట్స్ కాబట్టి ఆది వీటి మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు



Tags:    

Similar News