పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోని ఎవరికీ తెలియని ఒక క్వాలిటీ గురించి వెల్లడించాడు యువ నటుడు ఆది పినిశెట్టి. పవన్ మంచి మెకానిక్ అట. ఎలక్ట్రిక్ పరికరాల్ని రిపేర్ చేయడంలో.. సెట్ చేయడంలో పవన్ కు మంచి నైపుణ్యం ఉందట. ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించాడు ఆది. పవన్ కళ్యాణ్ కు తాను చాలా పెద్ద ఫ్యాన్ అన్న ఆది.. ఐతే అందరిలాగా ఆయన సినిమాలు చూసి తాను అభిమానిని కాలేదని.. పవన్ సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయన్ని అభిమానించానని ఆది తెలిపాడు.
తన తండ్రి రవిరాజా పినిశెట్టితో చిరు కుటుంబానికి మంచి సంబంధాలుండటంతో పవన్ హీరో కాకముందు నుంచే తమ ఇంటికి వచ్చేవాడని ఆది తెలిపాడు. ఒక సందర్భంలో తన తండ్రి ఇంటికి ఒక కొత్త వీడియో ప్లేయర్ తెచ్చాడని.. కానీ దాన్ని సెట్ చేయడం తెలియక అందరం సైలెంటుగా ఉన్నామని.. అలాంటి సమయంలో పవన్ తమ ఇంటికి వస్తే.. అన్నా దాన్ని రెడీ చేసి ఇవ్వు అని తాను అడిగానని ఆది చెప్పాడు. దానికి చాలా వైర్లు ఉండి గందరగోళంగా ఉన్నప్పటికీ పవన్ అరగంట పాటు కష్టపడి దాన్ని సెట్ చేసి ఇచ్చాడని.. తర్వాత తామందరం కలిసి ఆ వీడియో ప్లేయర్లో తొలిసారి జురాసిక్ పార్క్ సినిమా చూసిన అనుభవాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని ఆది తెలిపాడు. ‘అజ్ఞాతవాసి’లో పవన్ తో కలిసి నటించిన అనుభవాన్ని తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఆది అన్నాడు.