అతడికి స‌మంత‌ యూట‌ర్న్ ఇస్తుందా?

Update: 2018-05-01 08:19 GMT
ర‌విరాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి మొద‌ట హీరోగా తెలుగులోనే ఎంట్రీ ఇచ్చాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఒక వి చిత్రం’ సినిమాలో బ‌క్క ప‌ల‌చ‌ని ప‌ర్స‌నాలిటీతో క‌నిపించిన కుర్రాడు కాస్తా... కోలీవుడ్ కి వెళ్ల‌గానే కండ‌లు పెంచేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అక్క‌డ సోలో హీరోగా బాగానే సినిమాలు చేస్తున్నా... తెలుగువాడిగా తెలుగువారికి ద‌గ్గ‌ర కావాలని ఇక్క‌డ మాత్రం విల‌న్ వేషాలు వేస్తున్నాడు ఆది.

‘లెజెండ్‌’ సినిమాతో జ‌గ‌ప‌తిబాబుకి విల‌న్ గా మంచి బ్రేక్ ఇచ్చిన  బోయ‌పాటి... ‘స‌రైనోడు’ చిత్రంతో ఆది పినిశెట్టిలోని మ్యాన్లీనెస్ ని తెలుగువారికి ప‌రిచ‌యం చేశాడు. తాజాగా ‘రంగ‌స్థ‌లం’ సినిమాలోనూ కుమార్ బాబుగా మంచి న‌ట‌న చూపించాడు ఆది. అయితే మ‌నోడికి మాత్రం ఈ విల‌న్‌ వేషాలు- సైడ్ క్యారెక్ట‌ర్లు చేయ‌డాలు అస్సలు ఇష్టం లేద‌ట‌. స్టార్ హీరోగా గుర్తింపు పొందాల‌నే తెగ ఆరాట‌ప‌డుతున్నాడు ఆది పినిశెట్టి. అందుకే ఈ సారి స‌మంత అయినా త‌న‌కు ‘యూ ట‌ర్న్’ ఇస్తుందేమోన‌ని ఆశ‌ప‌డుతున్నాడు.  విష‌య‌మేమిటంటే అక్కినేని స‌మంత‌... ఎంతో ఇష్ట‌ప‌డి చేస్తున్న చిత్రం ‘యూ ట‌ర్న్‌’. క‌న్న‌డంలో స‌క్సెస్ అయిన ఈ సినిమాను తెలుగు- త‌మిళ భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా ఓ కీల‌క పాత్ర క‌నిపించ‌బోతున్నాడు ఆది పినిశెట్టి.

ఈ పాత్ర క‌నుక క్లిక్ అయితే త‌న‌కు హీరోగా పేరొస్తుంద‌ని ఆశ‌ప‌డుతున్నాడు ఆది పినిశెట్టి. క‌న్న‌డ మాతృక‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌వీణ్ కుమారే ఇప్పుడు తెలుగు- త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా ఎం.వీ.వీ- కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ సినిమాలోనూ హీరోగా న‌టిస్తున్నాడు ఆది. ఈ సినిమాలో తాప్సీ- రితికా సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.
Tags:    

Similar News