బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా వరుసగా హీరోయిన్స్ మీటూ ఉద్యమంలో భాగంగా స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. ఎందరో ప్రముఖులు మీటూ ఉద్యమం కారణంగా పరువు పోగొట్టుకుంటున్నారు. కొందరైతే కెరీర్ నే కోల్పోతున్నారు. తాజాగా అహానా కుమ్రా మీడియా ముందుకు వచ్చింది. తాను ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి సంచలన విషయాలను బయట పెట్టి అందరు అవాక్కయ్యేలా చేసింది. బాలీవుడ్ లో కొన్ని వర్గాలు ఉంటాయి. ఏదో ఒక వర్గంలో చేరాల్సిందే అంటూ ఈమె చెప్పుకొచ్చింది.
‘లిపిస్టిక్ అండర్ మై బుర్ఖా’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన అహానా కుమ్రా పలు సంచలన విషయాలను బయట పెట్టింది. సాజిద్ ఖాన్ పై ఈమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అదే సమయంలో ఇండస్ట్రీలో తాను ఇంకా ఎదుర్కొన్న చేదు అనుభవాలను కూడా మీడియాతో ఈమె షేర్ చేసుకుంది. ఎంతో హుందాగా పైకి కనిపించే వారు లోపల మాత్రం చాలా అసహ్యంగా ప్రవర్తించేవారని, కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలనేంత బాధ వేసేది అంటూ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ లో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వాటి వల్ల నేను ఆత్మహత్య ఆలోచన చేసి - తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఆగిపోయాను. ప్రస్తుతం నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నా జీవితంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. తల్లిదండ్రులను చూసుకుంటూ వారితో హాయిగా ఉన్నాను అంది. బాలీవుడ్ లో తన మాదిరిగా ఇంకా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని - సినిమాల్లో ఛాన్స్ ల కోసం ఎదురు చూసే వారిని దారుణంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ అహానా కుమ్రా ఆవేదన వ్యక్తం చేసింది.