ఆ సీన్స్‌ షూట్‌ సమయంలో నిర్మాత వెకిలి చేష్టలు

Update: 2019-05-16 13:49 GMT
బాలీవుడ్‌ లో మీటూ ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుండి కూడా ఎవరో ఒక హీరోయిన్‌ లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మీటూ ఉద్యమం వేడి కాస్త తగ్గినా ఈ సమయంలో కూడా అడపా దడపా ఎవరో ఒకరు తాము గతంలో ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అహనా కుమ్రా నిర్మాత ప్రకాష్‌ ఝా పై ఆరోపణలు చేసింది. షూటింగ్‌ సమయంలో ఆయన ప్రవర్తన ఇబ్బంది పెట్టిందని చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక టాక్‌ షోలో పాల్గొన్న అహనా కుమ్రా మాట్లాడుతూ.. 2017లో విడుదలైన లిప్‌ స్టిక్‌ అండర్‌ బుర్ఖా చిత్రం కోసం కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రీకరణ చేస్తున్న సమయంలో నిర్మాత ప్రకాష్‌ దగ్గరకు వచ్చి నాతో అసభ్యంగా మాట్లాడాడు. ఆ వ్యాఖ్యల వల్ల నేను చాలా బాధ పడ్డాను. అలాంటి మాట మాట్లాడినందుకు అతడిని కొట్టాలనేంత కోపం వచ్చింది. కాని ఆ విషయంను దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ కు చెప్పాను. ఆమె వెంటనే ఆయన్ను అక్కడ నుండి వెళ్లి పోవాలంటూ కోపగించుకుంది. దాంతో ఆయన అక్కడ ఉండి వెళ్లి పోయాడు.

పలు వివాదాల నడుమ విడుదలైన లిప్‌ స్టిక్‌ అండర్‌ బుర్ఖా చిత్రంకు మంచి స్పందన వచ్చింది. సినిమాలో చాలా బూతులు, శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా కష్టపడి ఈ చిత్రంను మేకర్స్‌ విడుదల చేశారు. విడుదలకు ముందు వచ్చిన వివాదం కారణంగా విడుదల తర్వాత మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ చిత్రంతో అహనా కుమ్రాకు మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి నటికి లైంగిక వేదింపులు ఎదురవ్వడం పాపం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అహనా కుమ్రా కు సినీ వర్గాల వారు మరియు మహిళ సంఘాల వారు మద్దతు పలుకుతున్నారు.

Tags:    

Similar News