ఎంతో మంది అందమైన భామలు.. ఆ భామలలో ఆకాంక్ష పూరి ఒకరు. ఈమె ఎవరు అంటే.. తెలుగులో నటించలేదు కానీ తమిళ.. కన్నడ మలయాళ.. హిందీ భాషలను ఇప్పటికే కవర్ చేసింది. అయితే విశాల్ నటించిన డబ్బింగ్ సినిమా 'యాక్షన్' చూసి ఉంటే ఈ భామ పరిచయం అయ్యే ఉంటుంది. ఎందుకంటే 'యాక్షన్' లో మెయిన్ హీరోయిన్ తమన్నా అయితే సెకండ్ హీరోయిన్ ఆకాంక్ష పూరి. హిందీలో 'క్యాలెండర్ గర్ల్స్' తో పాపులర్ అయింది.
ఇదిలా ఉంటే ఈ భామకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఓ హాబీ. అందుకే లాక్ డౌన్ అయినా లాక్ ఆప్ అయినా అప్డేట్లు ఇవ్వడం మానదు.. పోస్టులు పెట్టడం ఆపదు. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఆమె నయనాలలో స్టార్లు కూడా అసూయపడే ఇంద్రజాలం ఉంది. #నో మేకప్ లుక్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో స్పోర్ట్స్ డ్రెస్ ధరించి తలకు ఓ హెయిర్ బ్యాండ్ తో స్పోర్ట్స్ స్టార్ లాగా కనిపిస్తోంది. ఈ ఫోటో స్పెషాలిటి ఏంటంటే మేకప్ లేకుండా సహజంగా ఉండడం. మేకప్ లేకపోయినా న్యాచురల్ బ్యూటీలాగా కనిపిస్తోంది. ఫోటోలో కింద డంబెల్స్ కూడా కనిపిస్తున్నాయి.
ఈ ఫోటోకు నెటిజన్ల నుండి మంచి స్పందనే దక్కింది. "మ్యాజికల్ అండ్ బ్యూటిఫుల్".. "పూరి జి.. ఆసమ్ జి".. "ఆ కళ్ళలో ఓ స్పార్క్ ఉంది" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక ఆకాంక్ష ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'యాక్షన్' తర్వాత ఒక్క ఆఫర్ కూడా రాలేదు. స్టోరీ అంతా అయి పొయింది కానీ ఈ పూరి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకుంటే వికీపీడియాలో ఈ పాప పుట్టిన రోజు "6 - ఆగష్టు -1950" అని స్పష్టంగా వెల్లడించారు. ఈ సంగతి కనుక పాపకి పొరపాటున తెలిస్తే ఒక్కసారి కళ్ళు బైర్లు కమ్మి పుసుక్కున కిందపడడం ఖాయం!