‘సాధించాలనే తపన గుండెల్లో నింపుకొని, అకుంఠిత దీక్షతో లక్ష్యం వైపు కదిలితే విజయం ‘బాంఛన్’ అంటది.’ ఇదే విషయాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి, అత్యద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు తమిళ నటుడు సూర్య. కొంత కాలంగా సరైన్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకి.. ‘ఆకాశం నీ హద్దురా’ రూపంలో బ్లాక్ బస్టర్ అందివచ్చింది.
ఓటీటీలో సంచలనం..
కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు లేక.. ఓటీటీల్లో విడుదల చేయాలా? వద్దా? అని తీవ్ర సంఘర్షణ ఎదుర్కొన్న నిర్మాతల్లో సూర్య కూడా ఒకరు. తప్పని పరిస్థితుల్లో ఏదైతే అదైంది అంటూ.. ముందడుగేశాడు ఈ తమిళ స్టార్. అయితే.. ఓటీటీలో ఈ మూవీ యూనానిమస్ సక్సెస్ ను సొంతం చేసుకుంది.
దేశంలోనే సెకండ్ ప్లేస్..
అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ మూవీ.. హ్యూజ్ రెస్పాన్స్ ను అందుకుంది. కేవలం నెలన్నర కితం విడుదలైన ఈ చిత్రం.. ఈ ఏడాది ఓటిటిలో అత్యధికంగా చూసిన ఇండియన్ సినిమాల్లో రెండో చిత్రంగా నిలిచింది. ఇంతే కాదు.. ఈ విషయాన్ని గూగుల్ కూడా ధృవీకరించింది.
గూగుల్ లో సెన్సేషన్..
గూగుల్ లో మోస్ట్ సెర్చెడ్ ఇండియన్ సినిమాల జాబితాలో కూడా ఈ మూవీ రెండవ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ వెల్లడించింది. ఈ విధంగా సూర్య-సుధా కొంగర కాంబోలో వచ్చిన ఈ ఇన్స్పైరింగ్ ఎమోషనల్ డ్రామా.. ఓటీటీ బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ లిస్ట్ లో మొదటి స్థానానంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ నటించిన ఆఖరి చిత్రం “దిల్ బెచారా” నిలిచింది.