బికినీకి పోర్న్ కి లింక్ ఏంటి బాబులూ

Update: 2016-11-05 03:52 GMT
బాలీవుడ్ లో టీనేజ్ బ్యూటీల హంగామా మామూలుగా ఉండదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సెలబ్రిటీ డాటర్స్ చాలామందే ఉన్నారు. అందరికీ ఎవరి స్టైల్ వారికి ఉన్నా.. పూజా బేడీ కూతురు ఆలియా ఇబ్రహీంను సంథింగ్ స్పెషల్ అనాల్సిందే.

సోషల్ మీడియా ఈ బ్యూటీ రెచ్చిపోయే తీరుపై చాలానే విమర్శలు వస్తున్నాయి. అసలు ఒంటిమీద వస్త్రాలను ఉంచుకోవడం ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా ఉంటాయి ఆలియా షేర్ చేసే ఫోటోలు. ఈ రేంజ్ స్కిన్ షో చేసేస్తుండడంతో.. ఈమెను బోలెడుమంది తిట్టిపోస్తున్నారు కూడా. స్లట్(వ్యభిచారిణి) అనడంతో పాటు.. 'బాలీవుడ్ కి కాదు.. పోర్న్ సినిమాలకు రెడీ అవుతోంది' అంటూ కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. వీటన్నిటికీ ఒకే ప్రశ్నతో నిలదీసింది ఆలియా ఇబ్రహీం.

'బాలీవుడ్ లో మాదిరిగానే నేను కూడా బికినీ వేసుకుంటున్నానంతే. బికినీలు వేసుకున్న వారు.. బీచుల్లో తిరిగే వారు బాలీవుడ్ సినిమాల్లో మాత్రం కనిపించడం లేదా? హీరోయిన్స్ అందరూ బికినీలు వేసుకుంటున్నారు.. షార్ట్ డ్రెస్ లతో హంగామా చేస్తున్నారు. వాళ్లు సినిమాలు చేస్తున్నపుడు.. నేను పోర్న్ కి రెడీ అయినట్లు ఎలా అవుతుందో అర్ధం కాలేదు. ' అంటోంది ఆలియా ఇబ్రహీం. మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎవరిస్తారో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News