బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సడెన్ షాకిచ్చారు. 15ఏళ్ల కాపురం అనంతరం తన రెండో భార్య.. కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆ మేరకు అమీర్ - కిరణ్ రావు జంట సంయుక్త ప్రకటన వెలువరించింది. తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ కి సహ-తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకుంటామని.. అలాగే పానీ ఫౌండేషన్ లో వృత్తిపరమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ఈ జంట ప్రకటించారు.
ఈ 15 అందమైన సంవత్సరాల్లో మేము జీవితకాల అనుభవాలు.. ఆనందం.. నవ్వులను పంచుకున్నాం. మా సంబంధం నమ్మకం- గౌరవం - ప్రేమతో మాత్రమే పెరిగింది. ఇప్పుడు మేము మా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ఇకపై భార్యాభర్తలుగా కాకుండా ఒకరికొకరు సహ తల్లిదండ్రులుగా కుటుంబంగా మాత్రమే ఉంటామని అమీర్ ఖాన్ - కిరణ్ రావు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
అమీర్ - కిరణ్ కొంతకాలం క్రితం విడిపోయారని విడివిడిగా జీవిస్తున్నా.. ఈ జంట తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ ను కలిసి పెంచుతారని ఓ గుసగుస వినిపించింది. మేము కొంతకాలం క్రితం ఒక ప్రణాళికాబద్ధమైన విభజనను ప్రారంభించాం. ఇప్పుడు ఈ ఏర్పాటును క్రమబద్ధీకరించడానికి సుఖంగా ఉన్నాము. ``విడిగా జీవించడం .. విస్తరించిన కుటుంబ ప్రమాణాలతో మా జీవితాలను పంచుకోవడం కొనసాగుతుంది. మేము మా కొడుకు ఆజాద్ కు అంకితభావంతో ఉన్న తల్లిదండ్రులం.. మేము కలిసి పెంచి పోషిస్తాం`` అని ఆ ప్రకటన తెలిపింది.
మేము సినిమాలు కలిసే చేస్తాం. పానీ ఫౌండేషన్ సహా ఇతర ప్రాజెక్టులపై సహకారిగా పని చేస్తూనే ఉంటాము. మా సంబంధంలో ఈ పరిణామం గురించి మా కుటుంబాలు స్నేహితుల నిరంతర మద్దతు అవగాహనకు పెద్ద ధన్యవాదాలు. ఈ లీపు తీసుకోవడంలో మేము ఎవరితోనూ అంత సురక్షితంగా ఉండలేము.. అని తెలిపారు. శుభాకాంక్షలు ఆశీర్వాదాల కోసం మేము మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాం. మా లాంటి - మీరు ఈ విడాకులను ముగింపుగా కాకుండా కొత్త ప్రయాణానికి ఆరంభంగా చూస్తారని ఆశిస్తున్నాము`` అని ప్రకటనలో కోరారు.
`లగాన్` చిత్రీకరణ సమయంలో అమీర్ - కిరణ్ మొదట కలుసుకున్నారు. దీనిలో అమీర్ ప్రధాన సూత్రధారి. ఆ చిత్రానికి కిరణ్ రావు సహాయ దర్శకురాలు. వారు 28 డిసెంబర్ 2005న పెళ్లాడారు. అమీర్ గతంలో రీనాదత్తాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్ - ఇరా ఖాన్ ఉన్నారు. జునైద్ ఇప్పటికే బాలీవుడ్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇరా ఖాన్ ప్రస్తుతం తన జిమ్ కోచ్ శిఖారే తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసినదే.