బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. తన పాత్రలతో జనాల్ని ఏడిపించడమే కాదు.. తాను కూడా అప్పుడప్పుడూ ఏడ్చేస్తుంటాడు. ఎమోషనల్ గా సాగే సినిమాలు చూస్తే ఆయన ఏడుపు ఆపుకోలేడు. ఇంతకుముందు మార్గరెట్ kal' సినిమా చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు ఆమిర్. ఆ సినిమా ప్రివ్యూ షో చూసొచ్చి మీడియా ముందే కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. లేటెస్టుగా ఆయన్ని ఇంకో సినిమా కదిలించేసింది. అదే.. కపూర్ అండ్ సన్స్. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన ‘ధర్మ ప్రొడక్షన్స్’ బేనర్ మీద నిర్మించిన సినిమా ఇది. షకున్ బత్రా దర్శకుడు. రిషి కపూర్ - సిద్దార్థ్ మల్హోత్రా - ఆలియా భట్ - ఫవాద్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు.
విడుదలకు ముందే బాలీవుడ్ సెలబ్రెటీల కోసం ఈ సినిమా ప్రివ్యూ షో వేశారు. అది చూసిన వాళ్లందరూ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఆమిర్ ఖాన్ అయితే కళ్లు తుడుచుకుంటూ మీడియా ముందుకొచ్చాడు. ‘‘నాకు ఎమోషన్ ఎక్కువ. మంచి సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోలేను. కపూర్ అండ్ సన్స్ అద్భుతమైన సినిమా. మానవ సంబంధాల నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. మనసును కదిలించే సినిమా ఇది’’ అన్నాడు. సీనియర్ నటుడు రిషి కపూర్ ఈ సినిమా కోసం పూర్తిగా అవతారం మార్చేసి.. పండు ముసలి పాత్రలో కనిపించాడు. ఆయన్ని ఆ పాత్రలో చూసి షాకవ్వాల్సిందే. ఈయనకు మేకప్ వేయడానికి హాలీవుడ్ నిపుణుల్ని పిలిపించారు. రిషి మేకప్ కే కరణ్ రూ.2 కోట్లు ఖర్చు చేయడం విశేషం.