బాలీవుడ్ మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ ని 'లాల్ సింగ్ చడ్డా' ఎంతగా నిరాశ పరిచిందో చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీనికి కారణాలు అనేకం. కానీ అమీర్ మాత్రం బాగా మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ముంబై విడిచిపెట్టాలని నిర్ణయించుకుని అమెరికాకు వెళ్లిపోయారు.
'లాల్ సింగ్ చడ్డా' చేదు జ్ఞాపకాల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని అమీర్ అమెరికా ట్రిప్ వేసారు. ప్రస్తుతం అయన అక్కడే సేద తీరుతున్నారు. మరోవైపు అమీర్ తదుపరి ఏ సినిమా చేస్తారు? అన్న వార్తలు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. అమీర్ సాబ్ హిట్ తో ముందుకు రావాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజా ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. స్పానిష్ చిత్రం 'క్యాంపియోన్స్' ఆధారంగా అమీర్ తదుపరి సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమా స్ఫూర్తితో అమీర్ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ సినిమా పూర్వ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ఇప్పుడవి దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి.
ఈ చిత్రానికి 'శుభ్ మంగళ్ సావధాన్' దర్శకుడు ఆర్.ఎస్ ప్రసన్న తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తిచేయాలన్నది ప్లాన్ గా చెబుతున్నారు.
ఇందులో అమీర్ ఖాన్ పొగరబోతు బాస్కెట్ బాల్ కోచ్ గా పాత్రలో కనిపించనున్నారుట.
ఆ పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని సమాచారం. మాతృకకు మించి మరింత శక్తివంతం గా పాత్రని డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో అమీర్ కి జోడీగా అనుష్క శర్మ నటిస్తుందని సమాచారం. శంకర్ -ఎహ్ సాన్ లాయ్ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకొచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.