స‌ర్ధార్జీ మాసిన గెట‌ప్ దేనికోసం?

Update: 2019-12-18 08:02 GMT
హీరోగారు గుబురు గ‌డ్డం.. జుల‌పాల జుత్తు.. ఒరిజిన‌లేనా?  లేక క్యారెక్ట‌ర్ కోసం చేసిన సెట‌ప్పా? అవి ఒరిజిన‌ల్ గా పెంచిన‌వి కాక‌పోయినా ప‌ర్ ఫెక్ట్ గా సూట‌య్యాయ‌నే చెప్పాలి. స్టార్ హీరో అమీర్ ఖాన్ ఓ పాత్ర‌ను ఎంచుకుంటే అందులో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేందుకు అత‌డు చేసే గ్రౌండ్ వ‌ర్క్ ఆ లెవ‌ల్లో ఉంటుంది. అందుక‌నే అత‌డు మిస్ట‌ర్ పర్ ఫెక్ట్.

జుల‌పాల జుత్తు.. గుబురు గ‌డ్డం .. ఆ మాసిన వెంట్రుక‌లు చూస్తుంటే పాత్ర కోసం అంత‌గా లీన‌మ‌వుతారా.. డెనిమ్ క్యాప్.. ప్రోయాక్టివ్ స్పోర్ట్స్ ష‌ర్ట్.. కాంబినేష‌న్ చూస్తుంటే అక్క‌డ‌ తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశం ఎంతో మాసీగా ఇంటెన్స్ తో ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ స్టిల్ `లాల్ సింగ్ చ‌ద్దా` చిత్రంలోనిది. అమీర్ ఇందులో ఎంతో ఎమోష‌న‌ల్ రోల్ ని పోషిస్తున్నారు.

అమీర్ ఖాన్ ఈ చిత్రంలో ఒక శిక్కు పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. అత‌డి గెట‌ప్ ఇప్ప‌టికే అభిమానుల్ని ఆక‌ట్టుకుంది. తాజాగా రివీలైన ఫోటోలో అమీర్ రూపం ఎగ్జ‌యిట్ మెంట్ పెంచుతోంది. శిక్కులు ఎక్కువ‌గా ఉండే ఛండీఘ‌ర్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. అద్వైత్ చంద‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రీనా క‌పూర్ ఖాన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 2020 డిసెంబ‌ర్ లో క్రిస్మ‌స్ కానుక‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది.  ప‌లు ఆస్కార్ అవార్డుల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఫారెస్ట్ గంప్` కి రీమేక్ ఇది.



Tags:    

Similar News