ప్రతి ఒక్కరికీ ఒక సంధి కాలం ఉంటుంది. రాహు కేతువు దశను కూడా ఎదుర్కోవాలి. అది ఎప్పుడు ఎవరిని ఎలా తరుముకొస్తుందో తెలీదు. బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లు అవుతాయి..! ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర హీరోల పరిస్థితి అలానే ఉంది. వందల కోట్ల వసూళ్లను సునాయాసంగా సంపాదించి పెట్టే టాప్ స్టార్లు ఇప్పుడు ఉసూరుమంటున్నారు. బాక్సాఫీస్ వెక్కిరిస్తుంటే చేసేదేమీ లేక నిట్టూరుస్తున్నారు.
లాల్ సింగ్ చద్దా తో అమీర్ ఖాన్ పరిస్థితి అదే. బాక్సాఫీస్ కింగ్ గా ఇన్నేళ్లుగా తానేంటో చూపించిన అమీర్ కి ఈ పరిస్థితి ఊహించనిది. ఇది నిజంగానే అతడికి సంధి కాలం. రాహు కేతువుల స్థానాలు పరిశీలించాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చద్దా దారుణ వైఫల్యం అమీర్ ని నిజంగా చాలా కుంగదీసింది. ఈ మూవీని రిలీజ్ కి ముందు ఓటీటీ డీల్ పూర్తి చేయకపోవడం కూడా ఇప్పుడు భారీ నష్టానికి కారణమవుతోంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తో అమీర్ కూరగాయల బేరానికి దిగినట్టు బేరమాడాల్సొస్తోంది.
నిజానికి రిలీజ్ ముందే డీల్ పూర్తి చేయాలనుకున్నాడు అమీర్. అప్పట్లో నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం విఫలమైంది. లాల్ సింగ్ చడ్డా కోసం అమర్ స్ట్రీమింగ్ దిగ్గజం నుండి 150 కోట్లు ఆశించాడు. అంతేకాకుండా లాల్ సింగ్ చద్దా చైనాలో విడుదల చేయాలని చూస్తున్నందున థియేట్రికల్ విడుదలైన ఆరు నెలల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ ప్రదర్శించాలని అమీర్ పట్టుబట్టారు. Netflix ఈ నిబంధనలను అంగీకరించలేదు. మొత్తానికి డీల్ అలా మధ్యలోనే వీగిపోయింది. కానీ ఇప్పుడు థియేట్రికల్ గా మూవీ డిజాస్టర్ రిజల్ట్ తర్వాత అమీర్ కి ఊహించని షాక్ తగిలింది.
అప్పట్లో 150 కోట్లు డిమాండ్ చేసిన అమీర్ కి రూ.125 కోట్ల వరకూ ఆఫర్ చేసింది నెట్ ఫ్లిక్స్. కానీ దానికి అతడు ససేమిరా అన్నాడు. ఇప్పుడు సీన్ అంతా మారింది. రూ. 80-90 కోట్లు మధ్యలోనే నెట్ ఫ్లిక్స్ ధరను కోట్ చేస్తోందని సమాచారం. రూ. సినిమా పరాజయం తర్వాత ఏకంగా మరో 50 కోట్లు తగ్గించేసి అడుగుతోంది. అయితే ఇంతలోనే నెట్ వర్క్ 18 మద్దతుతో లాల్ సింగ్ చద్దా వూట్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని కూడా కథనాలొచ్చాయి. కానీ అది నిజం కాలేదు. దీని వయాకామ్ 18 స్టూడియోస్ కూడా భారీ-బడ్జెట్ సాగాను సహ-నిర్మించింది.
అమీర్ ఖాన్ - నెట్ ఫ్లిక్స్ అధికారులతో మరోసారి చర్చలను పునఃప్రారంభించారు. ఈసారి వారు జాయింట్ గా ఒక ఫిగర్ ని కనుగొనగలిగారు. ఈ ఒప్పందం తమ ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చగలదని గ్రహించారని సమాచారం. అమీర్ ఖాన్ ఇమేజ్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్ ఫ్లిక్స్ భారీ సబ్‌స్క్రైబర్ బేస్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక మూలలను చేరుకోవడానికి సహాయపడుతుంది. అదే సమయంలో లాల్ సింగ్ చద్దా ఓవర్సీస్‌లో అసాధారణమైన వసూళ్లు చేసిందని నెట్ ఫ్లిక్స్ విశ్లేషించింది. క్లాస్ ప్రేక్షకులలో ఈ చిత్రానికి ఆమోదం పొందిందని ఈ రిజల్ట్ నిరూపించింది. అంతేకాకుండా వయాకామ్ 18 స్టూడియోస్ ను నడుపుతున్న పారామౌంట్ పిక్చర్స్ కూడా ఈ చిత్రాన్ని విస్తృతంగా ప్రమోట్ చేసింది. అమీర్ పాశ్చాత్య దేశాల్లో కూడా తెలిసిన వ్యక్తి. ఈ కారణాల వల్ల నెట్ ఫ్లిక్స్ సినిమాను కొనుగోలు చేయడంలో అర్థం ఉందని భావించింది. ఇది ఇప్పుడు ఆరు నెలల విండోకు బదులుగా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతుంది.
ఓవర్సీస్ మార్కెట్లలో `లాల్ సింగ్ చద్దా` USD 7.5 మిలియన్లు (రూ. 59.89 కోట్లు) రెండవ వారాంతం ముగిసే సమయానికి వసూలు చేసింది. ఇది గంగూబాయి కతియావాడి (USD 7.47 మిలియన్).., భూల్ భులయ్యా 2 (USD 5.88 మిలియన్).. ది కాశ్మీర్ ఫైల్స్ (USD 5.7 మిలియన్) రికార్డులను అధిగమించి అంతర్జాతీయ మార్కెట్‌లలో 2022లో అత్యధిక ఓవర్సీస్ గ్రాసర్ గా అవతరించింది. దేశీయ మార్కెట్ లో కంటే ఓవర్సీస్ లో ఎక్కువ వసూళ్లు సాధించిన అరుదైన బాలీవుడ్ చిత్రం ఇది. ఇండియాలో ఆగస్టు 22 సోమవారం వరకు 56.03 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.
ఓటీటీ రిలీజ్ ధర విషయానికొస్తే రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ని అమీర్ ఖాన్ రూ. 125 కోట్లు డిమాండ్ చేశాడు. అదే సమయంలో వారు రూ. మునుపటిలా 80 కోట్లు చెబుతున్నారు. కానీ మధ్యేమార్గంగా ధర సుమారుగా రూ. 90 కోట్లు ఖాయమవుతుందని అంచనా. ఈ వారంలో ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. త్వరలో ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. అమీర్ కెరీర్ లో కావాల్సింది డిమాండ్ చేసేవాడు. కానీ ఇప్పుడు కూరగాయల బేరమాడుతున్నాడు! అని గుసగుస వేడెక్కిస్తోంది.