అమీర్ మేన‌కోడ‌లు సినీ ఎంట్రీ హిట్లా ఫ్లాపా?

Update: 2020-05-02 05:15 GMT
బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల వెల్లువ గురించి తెలిసిందే. మిగ‌తా వాళ్ల మాటేమో కానీ ఖాన్ ల కుటుంబం నుంచి వార‌సులు వెండితెర ప్ర‌వేశంపై హ‌డావుడే వేరుగా ఉంటుంది. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ .. బాద్ షా షారూక్ ఖాన్ వార‌సులు ఇప్ప‌టికే బాలీవుడ్ ఆరంగేట్రం కోసం త‌హ‌త‌హ‌లాడుతుండ‌డం ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక అమీర్ కుటుంబం నుంచి ఇద్ద‌రు ముగ్గురు బరిలో ఉన్నారు. అమీర్ కుమార్తె ఇరా ఖాన్ ద‌ర్శ‌కురాలు కావాల‌నుకుంటోంద‌ని ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి. ఇటీవ‌ల ఫోటోషూట్లు చూస్తే తాను న‌టి అయినా ఆశ్చ‌ర్య‌ పోన‌క్క‌ర్లేద‌న్న సందేహాలు క‌లిగాయి. ఇక అమీర్ మేన‌కోడ‌లు జ‌యాన్ మేరీ ఖాన్ న‌టిగా రంగ ప్ర‌వేశం చేస్తోంది. అది కూడా ప్ర‌ఖ్యాత నెట్ ఫ్లిక్స్ సిరీస్ `మిసెస్ సీరియ‌ల్ కిల్ల‌ర్` ద్వారా తెరంగేట్రం చేస్తుండ‌డంతో ఆ కుటుంబంలో బోలెడంత సంద‌డి నెల‌కొంది.

ఆ సంద‌డి ఏ రేంజులో ఉందో తాజాగా రివీలైన ఫోటో చెబుతోంది. ఈ ఫోటో మిసెస్ సీరియ‌ల్ కిల్ల‌ర్ ప్రీమియ‌ర్ వేదిక వ‌ద్ద‌ నుంచి రిలీజైంది. నటుడు అమీర్ ఖాన్  కుటుంబ సభ్యులు ఈ కార్య‌క్రమానికి హాజ‌ర‌య్యారు. అమీర్ భార్య కిరణ్ రావు .. కుమార్తె ఇరా ఈ ఫోటోలో ఉన్నారు. ఇరా స్వ‌యంగా ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో ప్రీమియర్ నుండి ఫోటోలను పంచుకున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ప్రొజెక్టర్ సెట్ చేసి ఇంటి వ‌ద్ద‌నే ఈ సినిమాని చూపించార‌ట‌. ఇక ఇరా త‌న క‌జిన్ ని బ్లెస్ చేస్తూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యింది. ``ఇది ఆరంభం మాత్ర‌మే. నిన్ను చూసి గ‌ర్విస్తున్నా. నీతో ఎప్పుడూ అండ‌గా ఉంటాం. అభిమాని పోస్ట‌ర్ లో నిన్ను చూసి ఉత్సాహ ప‌డుతున్నాడు. నీతో క‌లిసి లేక‌పోయినా ఈ క్ష‌ణం .. మా మాట వింటున్నావ‌నే అనుకుంటున్నాం. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నీ కెరీర్ కి వెల్ కం`` అని తెలిపింది. మీరంతా చాలా అందంగా క‌నిపిస్తున్నారు.. ఈ ఆనందం చాలు! అని జ‌యాన్ రిప్ల‌య్ ఇచ్చారు.

మనోజ్ బాజ్‌పేయి- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో న‌టించిన కిడ్నాప్ డ్రామా ఇది. ఇందులో అమీర్ మేన‌కోడ‌లు జయాన్ కిడ్నాప్ కి గుర‌య్యే యువతి పాత్రలో నటించింది. అయితే మిసెస్ సీరియ‌ల్ కిల్ల‌ర్ సిరీస్ కి ప్ర‌తికూల స‌మీక్ష‌లు వెలువ‌డ‌డం నిరాశ‌ప‌రిచింది. ఇది ఏక్తా క‌పూర్ సీరియ‌ళ్ల‌కు కాపీ..అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇందులో ఒక అవివాహిత స్త్రీ జ‌న‌నేంద్రియ నిపుణుడిని సంప్ర‌దించ‌డం ఆడ్ గా ఉంద‌న్న విమ‌ర్శలొచ్చాయి. జాక్వెలిన్ హిందీ భాష చెత్త‌గా ఉంది. దర్శకుడు శిరీష్ కుందర్ సినిమాలో భాష‌పై తీవ్రంగా నిర్లక్ష్యం చూపారు. మిసెస్ సీరియల్ కిల్లర్ నేను చూసిన చెత్త గ్రీన్‌స్క్రీన్ వ‌ర్క్ అంటూ విమ‌ర్శ‌లు పోటెత్తాయి.
Tags:    

Similar News