వామ్మో.. ఈ మాటలేంది ఐష్..?

Update: 2016-10-18 17:37 GMT
ఏ ముహుర్తంలో మొదలెట్టారో కానీ.. ‘‘యే దిల్ హై ముష్కిల్’’ సినిమా మెరుపుతీగకే మైండ్ బ్లాక్ అయ్యే అందాన్ని సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ ఎంతగా నానాలో అంతగా నానేసిందని చెప్పక తప్పదు. ఇప్పటివరకూ ఆమె ఎన్నో సినిమాల్లో నటించినా.. తన కో స్టార్ తో కథకు తగ్గట్లుగా ఎంత ఘాటు రొమాన్స్ చేసినా జరగనంత చర్చ.. యే దిల్ హై ముష్కిల్ మూవీ కారణంగా జరిగిందని చెప్పక తప్పదు. ఈ సినిమాలో తన కంటే పదేళ్లు చిన్నోడైన రణబీర్ కపూర్ తో ఐష్ చేసిన హాట్.. హాట్ దృశ్యాలు పిచ్చెక్కించటమే కాదు.. సినిమా మీద అంచనాల్ని భారీగా పెంచేశాయి. టీజర్ లో చూపించినంత ఘాటు రొమాన్స్ నిజంగా సినిమాలో ఉందో లేదో కానీ.. ఈ సినిమాలో ఐష్ పాత్ర గురించి ఊహాలకు రెక్కలొచ్చేసిన పరిస్థితి.

ఇది సరిపోదన్నట్లుగా.. ఈ సినిమా మొదలైన నాటి నుంచి అత్తా కోడళ్ల మధ్య రచ్చ మరింత పెరిగిందని.. అభిషేక్.. ఐష్ ల మధ్య కూడా సంబంధాలు ఏ మాత్రం సరిగా లేవన్న పుకార్లు షికార్లు చేస్తున్న పరిస్థితి. ఇందులో వాస్తవం సంగతి అలా ఉంచితే.. ఈ భారీగా రచ్చ జరుగుతున్న వేళ.. ఇటీవల ఒక మ్యాగ్ జైన్ కు ఫోటో షూట్ ఇచ్చిన ఆమె.. ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ మాటల్ని ఎలాంటి మూడ్ లో ఐష్ చెప్పిందో కానీ.. దీన్ని విన్నవారంతా నోరు వెళ్లబెళ్లటమే కాదు.. ఐష్ ఆలోచించే మాట్లాడుతుందా? అని అనుకునే పరిస్థితి. ఇంతకీ ఆమె చెప్పిన విషయం ఏమిటంటే..

ఈ మధ్యన రణ్ బీర్ కపూర్ ని తన తండ్రి అనుకొని.. డాడీ అంటూ తన గారాల పట్టి ఆరాధ్య పరిగెత్తుకుంటూ కౌగిలించుకుందని చెప్పి షాక్ ఇచ్చింది. అయితే.. ఇదంతా అభిషేక్ మాదిరి.. రణ్ బీర్ జాకెట్.. క్యాప్ పెట్టుకోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది. రణ్ బీర్ ఎప్పుడు కనిపించినా ఒకసారి అంకుల్ అని.. మరోసారి ఆర్కే అంటూ పిలుస్తుందని తన కూతురు ముచ్చట్లను మురిపెంగా చెప్పిందట. అయినా... అభిషేక్ హైట్ ఏంటి? రణ్ బీర్ హైట్ ఏంటి? ఎత్తులోనే అంత తేడా ఉన్నప్పుడు.. కోట్.. హ్యాట్ పెట్టుకుంటేనే రణ్ బీర్ ను తన డ్యాడీ అనేసుకునేంత చిన్నపిల్ల కాదే అరాధ్య? ఇప్పుడున్నపరిస్థితుల్లో ఇలాంటి మాటలేంది ఐష్..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News