విశ్వసుందరి ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ ల గారాల పట్టీ ఆరాధ్య బచ్చన్ పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఈ క్యూటీకి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఏర్పడింది. ఎంత విశ్వసుందరి అయినా ఓ బిడ్డకు తల్లిగా ఐశ్వర్యారాయ్ లాలింపు చూస్తున్నదే. విదేశాల్లో రెడ్ కార్పెట్ ఈవెంట్లకు సైతం ఆరాధ్య బచ్చన్ లేనిదే ఐసూ వెళ్లడం లేదు. తాజ్ మహల్ వీక్షణకు వెళ్లినా.. లేక ప్రపంచంలోని ఏడు వింతల సందర్భనానికి వెళ్లినా తనతో పాటే హబ్బీ అభిషేక్ బచ్చన్ ఉన్నా లేకపోయినా ఆరాధ్య మాత్రం ఉండి తీరాల్సిందే. ఇక ఆరాధ్య చిలిపి వేషాల్ని.. ట్యాలెంట్ కి సంబంధించిన విషయాల్ని నిరంతరం సోషల్ మీడియాల్లో రివీల్ చేస్తూనే ఉన్నారు ఐష్.
తాజాగా `కరోనా వీరుల` సేవలకు థ్యాంకూ చెబుతూ.. ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య చేసిన పని అభిమానుల్ని ఆకట్టుకుంది. ఆరాధ్య చిత్ర లేఖనంలో ప్రవీణురాలు అన్న సంగతి తాజా డ్రాయింగ్ చూస్తే అర్థమవుతోంది. ప్రాణాల్ని పణంగా పెట్టి కరోనాపై పోరాడుతూ అహర్నిశలు శ్రమిస్తున్న డాక్టర్లు.. నర్సులు.. పోలీసులు.. పారిశుద్ధ్య కార్మికుడు.. జర్నలిస్ట్.. సెక్యూరిటీ గార్డులు అందరినీ ప్రతిబింబిస్తూ ఆరాధ్య డ్రాయింగ్ వేసింది. వీరందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతూ.. వారిపై ప్రేమను చాటుకుంది క్యూటీ. అలాగే తాను బయటకి వెళ్లకుండా ఇంట్లోనే అమ్మా- నాన్నలతో ఉన్నట్లు ఇందులో గీసింది. `స్టే హోమ్.. స్టే సేఫ్` అంటూ జనజాగృతం చేసింది.
ఆరాధ్య డ్రాయింగ్ ని ఐశ్వర్యారాయ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసి మురిసిపోయారు. నా కూతురు కృతజ్ఞత.. లవ్ చూశారా? అంటూ తన క్రియేటివిటీకి మురిసిపోయారు. ఇక ఆరాధ్య బచ్చన్ మమ్మీలానే అందాల పోటీలకు వెళుతుందా.. కథానాయిక అవుతుందా? అంటూ అభిమానుల్లో ఇప్పటికే డిబేట్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్ లాంటి అందగత్తె మళ్లీ పుట్టబోరు. దేశం గర్వించదగ్గ అందాల నటిగానూ ప్రశంసలు అందుకున్నారు.