బీచ్ లో భార్యభర్తల యోగా పోజు ఇలా ఉంది

Update: 2019-06-21 10:33 GMT
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు యోగా చేస్తూ.. యోగా తమ జీవితంలో తీసుకొచ్చిన మార్పులు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులమీద పోస్టులు పెడుతున్నారు.  కొందరు రామ్ దేవ్ బాబా ట్రేడ్ మార్క్ పోజు లాగా గాలి పీలుస్తూ వదులుతూ సింపుల్ యోగా చేస్తున్నారు.  కొందరేమో తలకిందులుగా నిలబడి శీర్షాసనం వేస్తున్నారు. మరికొందరు మనకు నోరు తిరగని కష్టమైన పదాలతో కూడిన ఆసనాలు వేసి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.  ఆష్క గొరాడియా కూడా ఈ లిస్టులో జాయిన్ అయింది.

ఇంతకీ ఈ ఆష్క గొరాడియా ఎవరని అంటారా? సీరియల్స్ లో యామా ఫేమస్ బ్యూటీ.  క్యోకీ కి సాస్ బీ కభి బహు థీ.. బాల్ వీర్.. నాగిన్.. సాత్ ఫేరే లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్  లో నటించి బుల్లి తెర ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టింది.  ఈ భామ తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఇందులో తన భర్త బ్రెంట్ గొబ్లె తో కలిసి ఒక బీచ్ లో సింపుల్ గా కనిపించే కాంప్లికేటెడ్ పోజును జంటగా ఇచ్చారు ఇద్దరూ యోగాలో స్పెషలిస్టులు కాబట్టి అవలీలగా చేయగలిగారు. పొరపాటున కూడా మీరు చేయకండి.

ఈ ఫోటోలో బ్రెంట్ బీచ్ ఇసుకలో పడుకొని తన స్వీట్ వైఫ్ ను కళాత్మకంగా పట్టుకున్నాడు.  తన కాళ్ళను ఆష్క వీపు.. మెడకు సపోర్ట్ గా పెట్టాడు.  చేతులతో ఒక పాదాన్ని పట్టుకున్నాడు. భర్త ఇలా సపోర్ట్ ఇస్తే భార్య రెచ్చిపోయి బికినీలో ఒక ఖజురహో శిల్పం లాంటి భంగిమ పెట్టింది.  ఇద్దరి సమన్వయంతో ఒక లవ్ సింబల్ ఏర్పడింది. ఈ ఫోటో మరీ ఆర్టిస్టిక్ గా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటో ఒక్కటే కాదు.. ఆష్క తన ఇన్స్టా ఖాతా ద్వారా మరో కఠినమైన తితిభాసన చేస్తున్న విడియో ను షేర్ చేసింది.  నేను అంతంతమాత్రమే సదరు ఆసనాన్ని చేశానని.. త్వరలో పర్ఫెక్ట్  గా చేస్తానని చెప్పుకొచ్చింది.  ఆమె ఉద్దేశంలో ఆసనం అట్టట్ట చేసి ఉండొచ్చు కానీ మనకు చూసేందుకు అదే ఎక్కువ!
Tags:    

Similar News