భూత్ పోలీస్ నుంచి మొద‌టి మ్యాజిక‌ల్ సాంగ్

Update: 2021-08-26 23:30 GMT
బాలీవుడ్ హర్రర్ కామెడీ `భూత్ పోలీస్` ప్ర‌చార వీడియోలు ఆద్యంతం ఉత్కంఠ పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుండి మొదటి పాట విడుదలైంది. ఆయి ఆయ్ భూత్ పోలీస్ అనే పాటలో సైఫ్ అలీ ఖాన్- అర్జున్ కపూర్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డ్యాన్సింగ్ విన్యాసాలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ఈ పాట‌లో యామి గౌతమ్ ఎక్క‌డా కనిపించ‌లేదు.

ఈ మ్యూజిక్ వీడియోలో సైఫ్- అర్జున్ - జాక్వెలిన్ న‌డుమ రొమాన్స్ వేడెక్కిస్తోంది. ఒక భారీ భూత్ భ‌వ‌నంలో చాలా మంది డ్యాన్సర్ లతో పార్టీ మూడ్ లో పాట ర‌క్తి క‌ట్టించింది. ఈ పాటలో జాక్విలిన్ అంద‌చందాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారాయి. సచిన్-జిగర్ సంగీతం అందించిన ఈ పాటను విశాల్ దడ్లాని - సునిధి చౌహాన్ పాడారు.

భూత్ పోలీస్ చిత్రానికి పవన్ కృపలానీ దర్శకత్వం వహించారు. ఇది దెయ్యం వేటగాళ్ల సమూహం వారి సాహసాల కథతో తెర‌కెక్కింది. రమేష్ తౌరానీ-అక్షయ్ పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

భూత్ పోలీస్ షూటింగ్ నవంబర్ 2020 లో హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభమైంది. ఇంతకుముందు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10 న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు, అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇది ఇప్పుడు డిజిటల్ లో విడుదల అవుతుంది. ఈ చిత్రం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17న విడుదల కానుంది.

సైఫ్ గతంలో భూత్ పోలీస్ లో త‌న పాత్ర‌ను డ్రీమ్ రోల్ గా భావించారు. ``నిజాయితీగా.. నేను చాలా కష్టపడ్డానని నమ్ముతున్నాను. నేను మానసికంగా .. వృత్తిపరంగా కొంచెం అల‌స‌ట‌లో ఉన్నాను. నేను దాని నుండి బయటపడగలిగాను. ఇది పర్వతం ఎక్కడం లాంటిది. నేను బేస్ క్యాంప్ 1 లో ఉన్నట్లు నేను భావిస్తున్నాను. మేము పురోగతి సాధించాము కానీ వెళ్ళడానికి చాలా దూరం ఉంది. తాడులు సెట్ చేసాం. బూట్లు కట్టివేశాం. మేము కొండపై దృష్టిని సారించి పైకి ఎక్కుతున్నాము. నిజంగా మంచి లైన్ ఉంది. నేను చాలా సంతోషిస్తున్నాను.. భూత్ పోలీస్   80శాతం పూర్తయింది. ఇది నాకు డ్రీమ్ రోల్`` అని సైఫ్‌ చెప్పాడు.

సైఫ్ ప్ర‌స్తుతం ప్రభాస్ తో కలిసి `ఆదిపురుష్ 3డి`లోనూ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో లంకేశ్ పాత్ర‌లో సైఫ్‌ నటిస్తున్నాడు. రాణి ముఖర్జీతో క‌లిసి బంటీ ఔర్ బబ్లీ 2 కూడా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.


Full View
Tags:    

Similar News