బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ముద్దు సీన్‌

Update: 2020-11-07 17:00 GMT
దక్షిణాదిన తెలుగు మరియు తమిళ భాషల బిగ్‌ బాస్‌ షోలు నడుస్తున్నాయి. ఇదే సమయంలో ఉత్తరాదిన కూడా బిగ్‌ బాస్ షో కొనసాగుతుంది. హిందీ బిగ్‌ బాస్‌ ప్రస్తుతం 14వ సీజన్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్‌ బాస్‌ లో రొమాన్స్‌ లు దక్షిణాది బిగ్‌ బాస్‌ ల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. మసాలా పాళ్లు ఎక్కువగా ఉండే హిందీ బిగ్‌ బాస్‌ ఈసారి మరింత ఆసక్తికరంగా ఎంటర్‌ టైనర్‌ గా కొనసాగుతోంది. సల్మాన్‌ ఖాన్‌ ఇంటి సభ్యులను ఎంతగా భయపెడుతాడో అంతగా వారికి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈవారం వీకెండ్‌ ఎపిసోడ్‌ లో సల్మాన్‌ రచ్చ రంబోలా అన్నట్లుగా ఇంటి సభ్యులకు రచ్చ రచ్చగా డాన్స్‌ చేయమని సూచించారు.

ఇంటి సభ్యులు జంటలుగా విడిపోయి డాన్స్‌ లు చేస్తున్నారు. రియల్‌ జంట అయిన అభినవ్‌ మరియు రుబినాలు కలిసి తుహై బివి నెం.1 పాటకు డాన్స్‌ చేశారు. ఆ డాన్స్‌ సందర్బంగా రుబినా పెదాలపై అభినవ్‌ ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఆ ప్రోమో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంటి సభ్యులు అంతా కూడా సరదాగా చేసిన డాన్స్‌ లతో పాటు స్టేజ్‌ పై సల్మాన్‌ ఖాన్‌ చేసిన డాన్స్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ వారం స్టేజ్‌ పై స్పెషల్‌ గెస్ట్‌ లతో సల్మాన్‌ కనిపించాడు.


Full ViewFull View
Tags:    

Similar News