అరుదైన బాక్సాఫీస్‌ ఫైట్‌ క్యాన్సిల్‌

Update: 2019-05-25 17:30 GMT
హీరో.. హీరోయిన్స్‌ సినిమాల సంఖ్య ఇప్పుడు చాలా వరకు తగ్గింది. కాని రెండు దశాబ్దాల క్రితం వరకు ఒక్కో హీరో హీరోయిన్‌ సంవత్సరంలో ఏకంగా డజను సినిమాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అదే విధంగా ఒకే హీరోయిన్‌ నటించిన రెండు సినిమాలు కూడా ఒకే రోజున వచ్చిన సందర్బాలు మనం ఇప్పటి వరకు చూశాం. కాని ఒకే హీరో హీరోయిన్‌ కలిసి నటించిన రెండు సినిమాలు ఒకే రోజున రావడం అనేది ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ చరిత్రలో జరగలేదు.

ఆ అరుదైన సంఘటనకు మే 31 వేదిక అవ్వబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అరుదైన బాక్సాఫీస్‌ వార్‌ కోసం తమన్నా.. ప్రభుదేవాల కాంబో రెడీ అయ్యింది. వీరిద్దరు కలిసి నటించిన అభినేత్రి 2 మరియు కామోషి చిత్రాలను రెండు కూడా మే 31న విడుదల చేయాలని ఆయా చిత్రాల నిర్మాతల ఫిక్స్‌ అయ్యారు. హీరో హీరోయిన్‌ మాత్రమే సేమ్‌ కాదు.. ఈ రెండు సినిమాల జోనర్లు కూడా సేమ్‌ అవ్వడంతో ఆసక్తికర ఫైట్‌ ఖాయం అని అంతా భావించారు.

రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం వల్ల అన్ని చోట్ల రెండు సినిమాలకు నష్టం ఖాయం అంటూ వారించేందుకు ప్రయత్నించినా కూడా ఏ నిర్మాత కూడా విడుదల వాయిదాకు ఒప్పుకోలేదు. విడుదల మరో నాలుగు రోజులు ఉండగా ఎట్టకేలకు కామోషి చిత్రంను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. గ్రాఫిక్స్‌ వర్క్‌ పెడ్డింగ్‌ లో ఉన్న కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే పోటీ వద్దనే ఉద్దేశ్యంతో చివరి నిమిషంలో సినిమాను వాయిదా వేసి ఉంటారనే టాక్‌ వినిపిస్తుంది. జూన్‌ 14న కామోషి చిత్రంను విడుదల చేయబోతున్నారు.

Tags:    

Similar News