సినిమా కోసం కౌంట్ డౌన్ మామూలే. ట్రైలర్లు.. టీజర్లు.. ఫస్ట్ లుక్ పోస్టర్ల కోసం కూడా కౌంట్ డౌన్స్ నడవడమూ మామూలే. ఐతే ‘అభినేత్రి’ టీమ్ మాత్రం కొన్ని రోజులుగా మేకింగ్ వీడియో కోసం కూడా కౌంట్ డౌన్ నడిపింది. మూడు రోజుల్లో.. రెండు రోజుల్లో.. నాలుగు గంటల్లో.. గంటలో.. అంటూ కౌంట్ డౌన్స్ తో హంగామా చేశారు ‘అభినేత్రి’ మేకర్స్. ఐతే ఇంత హడావుడి చేసి.. రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో చూస్తే.. అందులో అంత ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఈ మాత్రం దానికేనా ఇంత సీన్ చేశారు అనిపించేలా ఉంది ఆ నాలుగు నిమిషాల వీడియో.
ఈ వీడియోలో ఎక్కువ శాతం ప్రభుదేవానే వచ్చీ రాని ఇంగ్లిష్ లో కష్టపడి తన అనుభవాలు పంచుకుంటూ కనిపించాడు. ఈ సినిమాను మూడు భాషల్లో తీశామని.. ప్రతి డైలాగును మూడుసార్లు చెప్పాల్సి వచ్చిందని.. డైరెక్టర్ విజయ్ ఎనర్జీ వల్లే ఎవ్వరం అలసిపోకుండా పని చేశామని.. పది పన్నెండేళ్ల తర్వాత తమిళంలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని.. తమన్నా సో టాలెంటెడ్ అని చెప్పుకొచ్చాడు ప్రభుదేవా. అతను ఒక్కొక్కరి గురించి చెబుతుంటే మధ్య మధ్యలో మేకింగ్ విజువల్స్ కొన్ని చూపించారు. చివర్లో తమన్నా రెండు రకాల లుక్స్ లో దర్శనమిచ్చింది. అందులో గ్లామర్ లుక్ అదిరిపోయింది. మొత్తానికి ‘అభినేత్రి’ మేకింగ్ వీడియో అయితే ఏమంత ప్రత్యేకంగా అనిపించలేదు.
Full View