వెళ్లిపోతుంటే.. వెంటపడి పట్టుకున్నాడు

Update: 2015-05-25 13:30 GMT
నాకు సినిమాలు వద్దు మొర్రో! అని వెళ్లిపోతుంటే నన్ను వెంటాడి వేటాడి మరీ పట్టుకున్నాడని కమల్‌పై నాటీగా ఆరోపిస్తోంది నటి అభిరామి. నా మానాన నేను అమెరికా వెళ్లిపోయాను. 2004లో స్టడీస్‌కోసం వెళ్లిపోయి అక్కడే ఎవరికీ కనిపించకుండా దాక్కున్నా. కానీ నాకోసం ఎంతో ప్రయాసపడి వెతికి వెతికి పట్టుకున్నారు కమల్‌హాసన్‌. అతడు నాచేత ఉత్తమవిలన్‌కి డబ్బింగ్‌ చెప్పించారు. విశ్వరూపం 2 సినిమాకి డబ్బింగ్‌ చెప్పిస్తున్నారు... అంటూ ఆ రహస్యం కాస్తా విడమర్చి చెప్పింది అమ్మడు.

అసలు కమల్‌కి ఈ అమ్మడికి కనెక్షన్‌ ఎక్కడిది? అని మీకు సందేహం వస్తే దానికి కూడా సమాధానం రెడీగా ఉంది. అప్పట్లో కమల్‌హాసన్‌ సరసన విరుమాండి చిత్రంలో నటించింది. ఆ తర్వాత సైకాలజీలో డిగ్రీ పుచ్చుకోవడానికి అమెరికా వెళ్లిపోయింది. అంతేనా అమెరికాలో తనకి ఉన్న వ్యాపారాల్ని చూసుకోవడంలో బిజీ అయిపోయింది. అమెరికా టు ఇండియా, ఇండియా టు అమెరికా టూర్లతోనే జీవితం సరిపోయేది. ఇక నటించడానికి టైమే మిగిలేది కాదు.. అంటూ చెప్పుకొచ్చింది. విశ్వనటుడి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పింది. ప్రస్తుతం జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 36వయదినిలే చిత్రంలో సుశాన్‌ అనే పాత్రలో నటించాను. అలాగే తమిళ్‌లో కొన్ని స్క్రిప్టులు వింటున్నా.. అంటూ వివరాల్ని వెల్లడించింది అభిరామి
Tags:    

Similar News