కాకిపిల్ల కాకికి ముద్దు అన్న విషయం తేలిపోయింది. ప్రపంచంలో లిప్ స్టిక్ లో రంగులే లేనట్లుగా నేరేడు పండు రంగును ఎంచుకొని పెదాలకు దట్టంగా పూసుకొని.. కేన్స్ మీద ఆమె దర్శనం ఇవ్వటం.. ఆమెను చూసిన వాళ్లంతా షాక్ తినటమే కాదు.. ‘‘ఈమేనా ఐష్?’’ అంటూ అడిగిన వైనమే కాదు.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం పెద్ద చర్చనే రేపింది.
అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వయసు మీద పడుతున్నా సొగసు ఏ మాత్రం తగ్గని ఐష్ తొలిసారి.. ఇంత చెత్తలా ఉందన్న మాటను అనిపించుకుంది. ఆమె నేరేడు రంగు పెదాల్ని చూసిన చాలామంది దడుసుకునే పరిస్థితి. ఇంతమంది ఇంతలా దడుసుకున్నా.. ఒక్కడి మనసు మాత్రం ఆమె విపరీతంగా దోచుకుంది. ఆ ఒక్కడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో? ఇంకెవరు రియల్ లైఫ్ లో ఆమె భర్త అయిన అభిషేక్ బచ్చన్ కు.. నేరెడు రంగు పెదాలున్న ఐష్ తనకెంతో నచ్చిందని చెప్పుకొచ్చారు.
బయటోళ్లు అయితే ఓపెన్ గా చెబుతారు. చూస్తూ.. చూస్తూ.. ఎవరో ఏదో అడిగారని.. అందరూ అన్నట్లుగా అభిషేక్ అంటే ఏం బాగుంటుంది? అందుకేనేమో.. వూదా రంగు లిప్ స్టిక్ లోనూ ఐష్ అదరగొట్టిందని కాంప్లిమెంట్ ఇచ్చేశారు. అభిషేక్ అలా కాంప్లిమెంట్ ఇవ్వకపోతే ఆశ్చర్యపోవాలి కానీ.. అంటూ నర్మగర్భంగా నవ్వుతున్నారు పలువురు. పెదాల రంగు ఏదైనా భర్తకు భార్య నచ్చకుండా ఉంటుందా..?