2020 మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ గతేడాది కాలంగా వార్తలలో నిలుస్తుంది. ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఈ సినిమాలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ ప్రధాన పాత్రలలో నటించారు. కథ, కథనాలతోపాటు పృథ్వీరాజ్, బిజు మీనన్ పాత్రలు, యాక్టింగ్ హైలైట్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కూడా అద్భుతమైన నటనతో సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. 2020లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో అయ్యపనుమ్ కోషియమ్ ముందు నిలుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా.. అన్నీ బాషల సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సౌత్ నార్త్ భాషల్లోని స్టార్ హీరోలందరూ రీమేక్ రైట్స్ కోసం పోటీపడి మరీ దక్కించుకున్నారు.
నిజానికి అయ్యపనుమ్ కోషియమ్ సినిమా హక్కుల కోసం బాలీవుడ్ నుంచి భారీ పోటీనే జరిగింది. చివరికి హిందీ రీమేక్ రైట్స్‌ను హీరో జాన్ అబ్రహం దక్కించుకున్నాడు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ జేఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రూపొందించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జాన్ అబ్రహం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అయితే తాజాగా హిందీ రీమేక్ లో జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ కలిసి నటించనున్నట్లు సమాచారం. ఈ విషయం కూడా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు జాన్. అంతేగాక అయ్యప్పనుమ్ కోషియం గురించి మాట్లాడుతూ.. యాక్షన్, థ్రిల్, చక్కటి కథాంశాలతో పొందికగా రూపొందింది. అలాంటి ఫీల్ గుడ్ స్టోరీని తెరకెక్కించాలనే ఉద్దేశంతో హిందీ హక్కులను సొంతం చేసుకున్నాం' అని చెప్పుకొచ్చాడు. ఇదివరకు అభిషేక్ తో జాన్ దోస్తానా సినిమా చేసాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పని చేయనున్నారని టాక్. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.