అమ్మ బిగ్ బాస్ ఎంత మోసం.. రేటింగ్ కోసం అభిజిత్ హారికలను రివర్స్ చూపించావా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో చాలా జంటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. మొదట అభిజిత్ మోనాల్ ల జోడీ సూపర్ అంటూ ట్రెండ్ చేశారు. అనూహ్యంగా మోనాల్ ప్రేమదేశం హీరోయిన్ మాదిరిగా అక్కడ ఇక్కడ అన్నట్లుగా సమ న్యాయం చేసేందుకు ప్రయత్నించింది. కాని అభిజిత్ అందుకు ఆసక్తి చూపించలేదు. మోనాల్ ను పక్కకు పెట్టేశాడు. దాంతో ఆమె పూర్తిగా అఖిల్ వైపు మళ్లింది. మోనాల్ నుండి దూరం అయిన తర్వాత అభిజిత్ ఎక్కువగా లాస్య నోయల్ హారిక లతో గడిపేవాడు. నోయల్ వెళ్లి పోయిన సమయంలో లాస్య మరియు హారికలతోనే ఎక్కువగా అభిజిత్ కూర్చునేవాడు. లాస్య కూడా పోయిన తర్వాత పూర్తిగా హారికతో ఉండేవాడు. ఆమె అఖిల్ తో కాస్త క్లోజ్ అయ్యి తనకు సమయం కేటాయించడం లేదని రాత్రి సమయంలో ఆమె బెడ్ పై చిన్న నోట్ పెట్టాడు.
నాతో టైం గడపడం లేదు అంటూ అభిజిత్ టిష్యూ పేపర్ పై రాశాడు. అది చాలా వైరల్ అయ్యింది. ఇద్దరు హగ్గులు మాటలు ఇవన్ని చూసి వీరిద్దరి మద్య వ్యవహారం చాలా చాలా దూరం వెళ్లినట్లుగా ఉందని అనిపించింది. కాని బిబి విన్నర్ గా నిలిచిన అభిజిత్ నేడు ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో ఆయన హారిక గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. నాకు ఒక తమ్మడు ఉన్నాడు.. చెల్లి ఉంటే నీలా ఉండేదేమో నీవు నా చెల్లిలా అనుకుంటున్నా అంటూ హారికతో చాలా సార్లు చెప్పాను. కాని మేము ఇద్దరం క్లోజ్ గా ఉన్నది చూపించారు కాని నేను తనను చెల్లి అన్నట్లుగా చెప్పింది మాత్ర చూపించలేదు అని బయటకు వచ్చాక తెలిసిందని అభిజిత్ పేర్కొన్నాడు.
అభిజిత్ మరియు హారికలను అన్న చెల్లి అంటూ చూపిస్తే ఎవరు చూడకపోయేవారు. కనుక రేటింగ్ కోసం వారిద్దరి మద్య ఏదో ఉందని ఎడిటింగ్ లో మాయ చేసి వారిద్దరి అభిమానుల ఫీలింగ్స్ తో బిగ్ బాస్ టీం ఆడుకుంది. బయట సోషల్ మీడియాలో అభిక అంటూ ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వారంతా కూడా నోరు వెళ్లబెడుతున్నారు.