'ఆచార్య' కు ఏదొకటి తేల్చి చెప్పు జక్కన్నా...!

Update: 2020-09-15 17:36 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో స్టార్ హీరో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' సినిమాలో కూడా నటించనున్నాడు చరణ్. అయితే ఈ సినిమా షూటింగ్ లో చరణ్ ఎప్పుడు పాల్గొంటాడు అనేది రాజమౌళి నిర్ణయంపై ఆధారపడి ఉంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకొని 70 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే కరోనా వచ్చి 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ప్లాన్స్ అన్నిటినీ తారుమారు చేసింది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేవి ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి. కాకపోతే ఇటీవల రాజమౌళి మాత్రం ఎప్పుడు స్టార్ట్ అయినా మరో ఆరు నెలల సమయం షూటింగ్ కు పడుతుందని క్లారిటీ ఇచ్చాడు.

అయితే చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రీకరణను బట్టి 'ఆచార్య' లో నటించడానికి ప్లాన్స్ వేసుకున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ జరుపుకున్న 'ఆచార్య' కోసం చరణ్ సుమారు నెల రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే రాజమౌళి అనుమతి లభిస్తేనే చరణ్ వేరే సినిమా షూట్ లో పాల్గొనే అవకాశం ఉంది. 'ఆర్.ఆర్.ఆర్' మరింత లేట్ అవుతుంది కాబట్టి ఆ గ్యాప్ లో 'ఆచార్య'లో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయాలని నిర్మాతల్లో ఒకరైన చరణ్ ఆలోచిస్తున్నారట. అందులోనూ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురావాలని ప్లాన్ చేసుకున్న చరణ్.. వీలైనంత త్వరగా తన షూట్ పూర్తి చేయాలనుకుంటున్నాడట. అయితే దీనికి ఇంకా రాజమౌళి నుంచి ఆమోదం లభించలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రాజమౌళి ఒకవేళ చరణ్ ని 'ఆచార్య' షూట్ లో పాల్గొనడానికి అనుమతిస్తే.. ముందుగా ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారట. ఎందుకంటే తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఎన్టీఆర్ చిత్రీకరణను బట్టి త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఏదేమైనా రాజమౌళి నిర్ణయంపై ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' తో పాటు మరో రెండు సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
Tags:    

Similar News