మోడ్రన్ లుక్స్‌లో మెరిసిపోతున్న గ్లామర్ క్వీన్ కృతి

ఆమె తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Update: 2024-11-25 10:30 GMT

టాలీవుడ్‌లో మొన్నటి వరకు సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కృతి శెట్టి ఈమధ్య వరుస ఫ్లాప్స్ తో కాస్త స్లో అయ్యింది. అయినప్పటికీ తన చీరల సొగసు, మోడ్రన్ డ్రెస్సింగ్‌తో ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈమధ్య పాప కెరీర్‌లో బిగ్ హిట్స్ లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమె హవా అస్సలు తగ్గడం లేదు. ఆమె తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.


కృతి శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోల్లో మోడ్రన్ స్టైల్‌లో డిఫరెంట్ లుక్స్‌తో కృతి కనిపించింది. రంగురంగుల టాప్, పర్‌ఫెక్ట్ ఎక్స్‌ప్రెషన్‌తో ఫోటోల కోసం ఫోజులిస్తూ ఆమె చలాకీతనాన్ని, అందాన్ని మరింత హైలైట్ చేసింది. ముఖ్యంగా, ఈ ఫోటోలలో ఆమె సింపుల్ గా ఉన్నా కూడా తన గ్లామర్ టచ్‌ను మిస్ చేయకుండా కంట్రోల్ చేస్తూ క్యూట్ లుక్స్‌తో మెరిసింది.


ఈ ఫోటోలకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. “నీ నవ్వు చూడటమే థెరపీ, నువ్వు మెరిసే చందమామ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కృతి ఫాలోవర్స్ ఆమె అందచందాలను తెగ ప్రశంసిస్తున్నారు. కృతికి ఉండే కలర్ టోన్, నేచురల్ లుక్స్ ఆమె ఫోటోలకు అదనపు ఆకర్షణను తీసుకొచ్చాయి. ఇక కెరీర్ విషయానికి వస్తే, ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కృతి, ఆ తర్వాత వరుస హిట్స్‌తో సక్సెస్ రేట్ పెంచుకుంది.


కానీ ఆ తరువాత చేసిన చిత్రాలు అంతగా రాణించలేకపోయాయి. ప్రస్తుతం తెలుగులో కూడా కొత్త ప్రాజెక్టుల కోసం చర్చలు జరుగుతున్నాయని టాక్. మరోవైపు, తమిళ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తన మార్క్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ పిక్స్ షేర్ చేయడం ద్వారా కృతి తనదైన ఫ్యాషన్, లైఫ్ స్టైల్‌ను ప్రెజెంట్ చేస్తూ, తన సోషల్ మీడియాలో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ వీకెండ్ థెరపీ ఫోటోలతో ఆమె మరింత పాపులర్ అవ్వడం ఖాయం.

Tags:    

Similar News