ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయిన ఆచార్య‌!

Update: 2022-01-03 02:30 GMT
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `ఆర్.ఆర్.ఆర్` వాయిదా ప‌రిశ్ర‌మ‌ని ఎంత‌గా ఇబ్బంది పెడుతుందో తెలిసిందే. జ‌న‌వ‌రి 7న రిలీజ్ అవ్వాల్సిన `ఆర్.ఆర్.ఆర్` వాయిదా ప‌డింది. దీంతో మ‌ళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ఏప్రిల్ లో రిలీజ్ అని ప్ర‌చారం సాగుతుంది.. కానీ రిలీజ్ అయ్యే వ‌ర‌కూ గానీ అస‌లు సంగ‌తేంటి? అన్న‌ది తేల‌దు. మ‌రి ఇలాంటి సందిగ్ధంలో ఆచార్య రిలీజ్ ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయిందా? అంటే అవున‌నే తెలుస్తోంది. `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ త‌ర్వాత `ఆచార్య` రిలీజ్ చేయాల‌న్న‌ది డీల్. ఆ ఒప్పంద ప్రాతిప‌దిక‌నే రామ్ చ‌ర‌ణ్ `ఆచార్య‌`లో నటించడానికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఒప్పుకున్నారు.

లేదంటే త‌న సినిమా మ‌ధ్య‌లో ఉండ‌గా మ‌రో సినిమా క‌మిట్ మెంట్ కు జ‌క్క‌న్న ఎంత‌మాత్రం ఒప్పుకోరు. మార్కెట్ స్ట్రాట‌జీ ప్ర‌కార‌మే జ‌క్క‌న్న చ‌ర‌ణ్ ని అలా లాక్ చేసారు అన్న‌ది వాస్త‌వం. తాజాగా ఈ విష‌యం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఎట్టి ప‌రిస్థితుల్లో `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ కాకుండా `ఆచార్య` రిలీజ్  అవ్వ‌డానికి వీలు లేద‌న్న‌ది మేక‌ర్స్ మ‌రోసారి ఉద్ఘాటించిన‌ట్లు స‌మాచారం. దీన్నిబ‌ట్టి `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ త‌ర్వాతే `ఆచార్య` రిలీజ్ అవుతుంద‌ని లీక్ అందింది. ప‌రిస్థితులు అన్ని స‌క్రమంగా ఉంటే ఏప్రిల్ లో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అవుతుంది. ఆ త‌ర్వాత `ఆచార్య` రిలీజ్ ఉంటుంద‌ని స‌మాచారం.

అయితే `ఆచార్య` ఫిబ్ర‌వ‌రి 4న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే  ప్ర‌క‌టించారు. `ఆర్.ఆర్.ఆర్` జ‌న‌వ‌రి 7న అని ఫిక్స్ అయిన త‌ర్వాత `ఆచార్య` రిలీజ్ వాయిదా ప‌డింది.  కానీ `ఆర్ ఆర్ ఆర్` వాయిదా ప‌డింది కాబ‌ట్టి ఇప్పుడు `ఆచార్య` కూడా ఏప్రిల్ తర్వాత‌నే ఉంటుంద‌ని తెలుస్తోంది. మొత్తానికి ఆచార్య ఏం చేసినా ఆర్.ఆర్.ఆర్ వ‌ల్ల ప్ర‌తిసారీ వెన‌క్కి వెళ్లాల్సి వ‌స్తోంది. అయితే చ‌ర‌ణ్ న‌టించిన రెండు భారీ సినిమాలు త‌క్కువ గ్యాప్ తో రిలీజ‌వుతుండ‌డం ఫ్యాన్స్ ని ఎగ్జ‌యిట్ చేస్తోంది. నిజానికి ద‌స‌రా బ‌రిలో వ‌స్తుంద‌నుకున్న ఆచార్య ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ చివ‌రిలో వ‌స్తుంద‌ని త‌ర్వాత సంక్రాంతికి వ‌స్తుంద‌ని ప్ర‌చార‌మైంది. ఆర్.ఆర్.ఆర్ వ‌ల్ల మ‌రోసారి వాయిదా ప‌డింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రోసారి రిలీజ్ తేదీపై సందిగ్ధ‌త ఏర్ప‌డింది.
Tags:    

Similar News