మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్రలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నెల 29వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మరో వారం రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు. చిరంజీవి తో పాటు రామ్ చరణ్ ఇంకా దర్శకుడు కొరటాల శివ ఇతర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల్లో సందడి చేయబోతున్నారు.
ఇక ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక గురించి ఇప్పుడు ప్రథానంగా చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ ను వెన్యూగా ఖరారు చేయడం జరిగింది. ఇక పోలీసుల మరియు ప్రభుత్వం అనుమతితో ఈనెల 24న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని తేదీని కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవి ముఖ్య అతిథిగా ఎన్నో సినిమాల వేడుకలు జరుగుతుంటాయి. ఆయన ముఖ్య అతిథి అంటే ఆ సినిమా స్థాయి అమాంతం పెరిగినట్లే. అలాంటిది ఆయన సినిమా కు ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరు వచ్చినా ఆయన కంటే తక్కువే.. అయినా కూడా సినిమాకు సంబంధించిన వారు కాకుండా బయటి వారు ఎవరు వస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.
గత రెండు మూడు రోజులుగా మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గాను పవన్ కళ్యాణ్ మరియు రాజమౌళి లు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి ప్రజెన్స్ తో ఆచార్య సినిమా స్థాయి అమాంతం పెరుగుతుంది అంటూ కొందరు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ ఈ సినిమా లో నటించాడు కనుక ఎలాగూ ఆయన వస్తాడు.
ఇంకా ఈ ప్రీ రిలీజ్ వేడుక లో రామ్ చరణ్ తల్లి సురేఖ మరియు చిరంజీవి తల్లి అంజనా దేవి గారు కూడా వస్తారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ కి చెందిన నాగబాబు ఇంకా కొందరు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేస్తారని అంటున్నారు. చాలా కాలం తర్వాత జరుగుతున్న ఈ మెగా వేడుక ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు కన్నుల విందుగా ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు.
చిరంజీవి మరియు రామ్ చరణ్ గతంలో ఒకటి రెండు సినిమాల్లో కలిసి కనిపించారు. కాని ఒక పూర్తి స్థాయి కథలో భాగం అయిన పాత్రల్లో వీరిద్దరు కలిసి నటించలేదు. మొదటి సారి వీరిద్దరు నటించిన కారణంగా... ఇప్పటి వరకు అపజయం అనేది ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన కారణంగా ఆచార్య పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న ఈ సమయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేస్తే సినిమా భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.