మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ను ఏప్రిల్ లో ముగించి మే లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. మే 13వ తారీకున ఈ సినిమాను విడుదల చేసేందుకు అంతా సిద్దం చేశారు. ఇలాంటి సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచి పోయింది. రెండు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉందని.. సెకండ్ వేవ్ కాస్త తగ్గిన వెంటనే షూటింగ్ ను మొదలు పెట్టి రెండు వారాల లోపే ముగించేయాలని భావిస్తున్నట్లుగా యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన సమయంలో జులై నెలలోనే షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అంతా భావించారు.
రామ్ చరణ్ పై షూటింగ్ ముగించిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవిపై కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ షెడ్యూల్ తో సినిమా ముగియనుంది అనుకుంటూ ఉండగా తాజాగా యూనిట్ సభ్యులు కాకినాడ పోర్ట్ లో షూటింగ్ కోసం ఆచార్య యూనిట్ సభ్యులు వెళ్లబోతున్నారనే వార్తలు మొదలు అయ్యాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా షూటింగ్ కాకినాడ షెడ్యూల్ తో ముగియబోతుందట. ముందుగ అనుకున్నదాని ప్రకారం కాకినాడ షెడ్యూల్ లేదని.. చివరి నిమిషంలో అనుకున్నారేమో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
మొత్తానికి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని చాలా మంది అనుకుంటున్నారు కాని కీలక సన్నివేశాల షెడ్యూల్ బ్యాలన్స్ ఉందని తాజాగా యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఆచార్య సినిమాను జులై లో ముగించి ఆగస్టు నుండి లూసీఫర్ షూటింగ్ లో చిరంజీవి జాయిన్ అయితే ఆయన పుట్టిన రోజు వరకు లూసీఫర్ రీమేక్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని అంతా ఆశపడ్డారు. కాని ఆగస్టులో కూడా ఆచార్య సినిమా ఉంటుంది కనుక లూసీఫర్ షూటింగ్ ఆరంభం అయ్యేది అనుమానమే.. అప్పుడు చిరు బర్త్ డే కు లూసీఫర్ అప్ డేట్ రావడం కూడా అనుమానమే అంటూ మెగా కాంపౌండ్ నుండి అనధికారిక వార్తలు వస్తున్నాయి.
ఆచార్య సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను పక్కా కమర్షియల్ మూవీగా అలాగే ఒక మంచి సోషల్ మెసేజ్ మూవీగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. ఆయన సినిమా లు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ప్లాప్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి కూడా భారీ వసూళ్లను నమోదు చేస్తున్నాయి. కనుక ఆచార్య సినిమా అంతకు మించి అన్నట్లుగా వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. చిరంజీవి మరియు చరణ్ లు నటించడం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరిగింది.
మణిశర్మ సంగీతం అందిస్తుండటంతో పాటల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఒక పాట సినిమా రేంజ్ ను అమాంతం పెంచేసింది. ముందు ముందు వచ్చే పాటలు కూడా తప్పకుండా బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలుస్తాయనే నమ్మకంను అంతా కలిగి ఉన్నారు. ఈ ఏడాదిలో ఆచార్య సినిమా విడుదల చేయాలని మెగా స్టార్ భావిస్తున్నాడట. అయితే కరోనా అందుకు సహకరిస్తుందా అనేది చూడాలి.