ఆచార్య స్పీక్స్ నౌ : ఆంధ్రా చార్లీ చాప్లిన్ మ‌ళ్లీ వ‌స్తున్నాడ‌హో !

Update: 2022-04-28 06:35 GMT
జీవితాన్ని విషాదం న‌డిపిస్తుంది క‌న్నీళ్లు మారుస్తాయి క‌థ‌న వేగం మారుతుంది పై వాడి రాత‌లో అత‌డొక చంట‌బ్బాయి తెలుగు తెలిసిన తెలుగు అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌లిగిన చాప్లిన్ మ‌న‌కు ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటే ద‌ర్శ‌క ర‌చ‌యిత ఇదిగో చిరంజీవి ఉన్నారు క‌దా ! అని నిరూపించిన గ్రేట్ థియేట్రిక‌ల్ డ్రామా అది.

అలాంటి ప్లేను మ‌ళ్లీ రిపీట్ చేయ‌డం క‌ష్టం కానీ చిరు అది బ‌న్నీతోనే సాధ్యం అంటున్నాడే ? వినేందుకు ఆశ్చ‌ర్యం.. బ‌న్నీ ఫ్యాన్స్ కు అయితే ఆనందం. ఆశ్చ‌ర్యం ఎందుకంటే చార్లీ  స్థాయిలో న‌టించి మెప్పించ‌డం క‌ష్టం.. అందుకు ఆశ్చ‌ర్యం. థియేట్రిక‌ల్ డ్రామాను ప‌డించ‌డం అంటే స్ట్రీట్ ప్లే తెలిసి ఉండాలి.. అంటే వీధి నాట‌కం తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం సులువు.

ఆ విధంగా బ‌న్నీ  న‌ప్పితే, ఆ పాత్ర‌కు అన్నీ కుదిరితే ఆయ‌న‌కు తిరుగులేదంతే ! చిరు న‌మ్మ‌కం కూడా ఇదే !చంట‌బ్బాయి.. చార్లీ చాప్లిన్ ఇద్ద‌రూ వేర్వేరు కాదు.. న‌వ్వించి ఏడిపించ‌డంలో ఆయ‌న ఎన్నో శిఖ‌రాలు దాటారు.. ఆ విధంగా  చాప్లిన్ మ‌న జీవితాల‌ను ప్ర‌భావితం చేసి వెళ్లారు. చాప్లిన్ మాదిరి చిరు కూడా న‌ట జీవితానికి ఏం అవ‌స‌ర‌మో అవ‌న్నీ  నేర్చుకుంటూ ఇటుగా వ‌చ్చారు. అందుకే ఆయ‌న మెగాస్టార్ అయ్యారు.

ఇప్ప‌టికీ కామెడీ టైమింగ్ లో మెగాస్టార్ ను దాటి చేసే వాళ్లెవ్వ‌రూ లేరు.. ఒకానొక ద‌శ‌లో ఓ స్టార్ హీరో ఇన్ని డైమ‌న్ష‌న్లలో న‌టించ‌గ‌ల‌రా అని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. చంటబ్బాయి సినిమా ఆయ‌న కెరియర్ ను మార్చింది. ముఖ్యంగా ర‌చ‌యిత జంధ్యాల డైరెక్ష‌న్ చేసిన ఫిల్మ్ ఇది. ఈ సినిమా  చిరు మ‌రో చార్లీ చాప్లిన్ అయిపోయారు. అంత బాగా న‌టించారు.

అస‌లు తెలుగు తెలిసిన చార్లీ చాప్లిన్ చిరు అనిపించుకున్నారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆంధ్రా చార్లీ మ‌ళ్లీ రానున్నాడా ? అవును వ‌స్తాడు న‌వ్విస్తాడు ఏడిపిస్తాడు.. అమాయ‌క‌పు చూపులు రువ్వుతాడు కూడా!ఆ విధంగా మ‌ళ్లీ చంట‌బ్బాయిని హ‌రీశ్ శంక‌ర్ లాంటి వారు తీస్తే, బ‌న్నీ నే చంట‌బ్బాయి కాగ‌ల‌రు అని అంటున్నారు చిరు.

ఆచార్య ఫిల్మ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా .. ! ఎనీవే బ‌న్నీలో ఈ ఎన‌దర్ సైడ్ ఎలా ఉంటుంది అన్న‌దే ఆస‌క్తిదాయ‌కం. ఆల్ ద బెస్ట్ బ‌న్నీ. అదొక క్లాసిక్ మ‌ళ్లీ ఆ ఆన్ స్క్రీన్ వండ‌ర్ రిపీట్ కాదు కానీ చేయాల‌నుకుంటే చేయండి.
Tags:    

Similar News