రెండు పండుగల మద్య 'ఆచార్య' ఊగిసలాట?

Update: 2021-08-25 15:30 GMT
మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల కాంబోలో రూపొందిన ఆచార్య సినిమా షూటింగ్‌ దాదాపుగా ముగిసింది. కాని ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ కు ఆచార్య ను మే లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాని లాక్ డౌన్ కారణంగా విడుదల చేయడం సాధ్యం కాలేదు. సెకండ్‌ వేవ్‌ లాక్ డౌన్ తర్వాత షూటింగ్‌ ను ముగించారు. కాని విడుదల తేదీ ప్రకటించాల్సి వస్తుందని షూటింగ్‌ ఇంకా బ్యాలన్స్ ఉందని చెబుతున్నారు అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ వస్తే ఆచార్య ను ప్రకటించాలని మొదట భావించారు. దసరా కానుకగా రావాలనుకున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా కొన్ని కారనాల వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా విడుదల వాయిదా వేసిన వెంటనే ఆచార్య ను విడుదల చేయాలనే అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆచార్య సినిమా విడుదల ను దసరా బరి నుండి కూడా తప్పించినట్లుగా తెలుస్తోంది.

థర్డ్‌ వేవ్‌ ను సెప్టెంబర్‌.. అక్టోబర్‌ మరియు నవంబర్‌ అంటున్నారు. కేసుల పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా చాలా మంది సినీ ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాలవ ఆరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే అక్టోబర్‌ లో సినిమా ను విడుదల చేయక పోవడం మంచిది అనే ఉద్దేశ్యంతో కొందరు ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయంలో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు దసరాకు సినిమా వస్తుంది అనే అనుమానం లేదు. సంక్రాంతికి సినిమా విడుదల అవుతుంది అంటూ కొందరు నమ్మకంగా చెబుతున్నారు. కాని ఆ సమయంలో పవన్‌ భీమ్లా నాయక్‌.. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలు ఉన్నాయి. కనుక వారికి పోటీగా చిరంజీవి సినిమా వస్తుందని తాను భావించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. దసరాకే పోటీ తక్కువ ఉంది కనుక అప్పుడే విడుదల చేసుకుంటే బెటర్‌ అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

దసరా సీజన్ లో బాలకృష్ణ అఖండ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అఖండ సినిమా విడుదల తేదీని ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల వాయిదా పడ్డ వెంటనే ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఆ సినిమా సిద్దంగా ఉంది. కనుక దసరాకు సినిమాను విడుదల చేసేలా అఖండ ప్లాన్‌ చేస్తున్నారు. కాని ఆచార్య మాత్రం దసరాకు రావాలా వద్దా అనే సందేహంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా ను సరైన సమయంలో విడుదల చేస్తేనే మంచి వసూళ్లు వస్తాయి. వంద కోట్లకు పై గా రాబట్టాలంటే ఖచ్చితంగా మంచి సమయం చూసి విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో రామ్‌ చరణ్ మరియు మేకర్స్ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చివరకు విడుదల విషయంలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఆచార్య విషయంలో కొందరు దసరా మరియు సంక్రాంతి ఊగిసలాట కొనసాగుతుంది అంటున్నారు. కాని మేకర్స్ నుండి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ అయితే లేదు. ముందు ముందు అయినా ఆచార్య విడుదల విషయంలో స్పష్టత వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News