మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా అంచనాలకు మించి ఉంటుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న కారణంగా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా నమ్మకం వ్యక్తం అవుతుంది. ఇంతగా నమ్మకం ఈ సినిమాపై ఉండటానికి మరో కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అనడంలో సందేహం లేదు. ఈ సినిమా లో ఆయన పాత్ర అర్థ గంటకు ఎక్కువే ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమా లో చిరంజీవి మరియు చరణ్ ల కాంబో సన్నివేశాలు అద్బుతంగా తీశారని అంటున్నారు. కథలో కీలకమైన పార్ట్ లో చరణ్ ఉంటాడని అంటున్నారు. ఇక కథ ట్విస్ట్ విషయానికి వస్తే సంగీత పాత్ర వల్ల కథలో ట్విస్ట్ వస్తుందని మేకర్స్ అనధికారికంగా చెబుతున్నారు. సంగీత పాత్ర చనిపోవడంతో ఆచార్య కథలో ట్విస్ట్ వస్తుందని.. ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ ప్రైజ్ అయ్యే విధంగా ఈ సినిమా లోని సంగీత సన్నివేశాలు ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక కొరటాల శివ ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
స్వతహాగా రచయిత అయిన కొరటాల శివ ఈ కథను తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రాసుకున్నాడట. కథ రాసుకున్న సమయంలోనే ఇది ఒక పెద్ద స్టార్ హీరోతో చేయాలని ఆయన భావించాడు. అందుకే ఇన్నాళ్లు వెయిట్ చేసి చిరంజీవి వంటి స్టార్ తో సినిమాను మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు. కరోనా వల్ల ఆలస్యం అవుతున్న ఈ సినిమాను గత నెలలో విడుదల చేయాలని భావించారు. కాని సెకండ్ వేవ్ వల్ల మళ్లీ నిలిచి పోయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కూడా ఇంకా పూర్తి చేయలేదు. రెండు వారాల షూటింగ్ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుందని అంటున్నారు.
ఆచార్య సినిమా లో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా కోసం భారీ టెంపుల్ సెట్ ను నిర్మించారు. సినిమాలోని కీలక సన్నివేశాలను మరియు పాటలను అక్కడే చిత్రీకరించారు. సినిమా కు ఆ సెట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ ను ముగించి దసరాకు ఈ సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించే ఉద్దేశ్యంతో మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.