ఆచార్య : స్పెషల్‌ గెస్ట్‌ కి స్పెషల్‌ గెస్ట్‌ ఎవరు?

Update: 2022-04-22 06:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ నెలలోనే విడుదల కాబోతున్న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక ను రేపు హైదరాబాద్‌ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు రంగం సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్‌ చరణ్ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. సినిమా పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక పై జనాల్లో ఆసక్తి ఓ రేంజ్ లో ఉంది.

ఈ ప్రీ రిలీజ్ వేడుక కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తాడు అంటూ నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. రాజమౌళి కూడా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొంటాడనే ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. హైదరాబాద్‌ యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో ప్రీ రిలీజ్ వేడుక అంటూ అధికారికంగా ప్రకటన అయితే వచ్చింది కాని ఇప్పటి వరకు స్పెషల్‌ గెస్ట్‌ ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

కొన్ని వందల సినిమాల కార్యక్రమాలకు స్పెషల్‌ గెస్ట్‌ గా వెళ్లిన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా కు ప్రతి సారి కూడా స్పెషల్‌ గెస్ట్‌ విషయంలో కాస్త అటు ఇటు చర్చ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన స్థాయి లో ఎవరు లేకున్నా కూడా ఎవరినో ఒకరిని ప్రముఖులను స్పెషల్‌ గెస్ట్‌ గా తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక స్పెషల్‌ గెస్ట్‌ గా ఎవరు వస్తారు అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు కొరటాల శివ ఈ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఎవరైనా స్పెషల్‌ గెస్ట్‌ లు వస్తారా లేదంటే చిరంజీవి మరియు రామ్ చరణ్ లతోనే సరిపెట్టేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి వంటి స్టార్‌ హీరో ఆహ్వానిస్తే ఎవరైనా వెళ్లాల్సిందే. కాని ఆయన స్థాయికి తగ్గ వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఎవరు వస్తారు అనేది చూడాలి.

ఆచార్య సినిమా లో చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించింది. రామ్ చరణ్‌ పాత్ర కూడా చాలా పెద్దగానే ఉంటుందని.. ఆయనకు జోడీగా పూజా హెగ్డే కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమాలో చిరంజీవి మరియు చరణ్ ల కాంబోలో వచ్చే సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగ అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ మరోసారి ఈ సినిమా తో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకాన్ని మెగా ఫ్యాన్స్ బలంగా వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News